Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నారా లోకేశ్‌పై రాళ్ల దాడిలో ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం… మ‌రో కానిస్టేబుల్‌కూ గాయాలు

నారా లోకేశ్‌పై రాళ్ల దాడిలో ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం… మ‌రో కానిస్టేబుల్‌కూ గాయాలు
-హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన లోకేశ్
-దుగ్గిరాల‌లో హైటెన్ష‌న్‌
-లోకేశ్, పై రాళ్లు విసిరిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు
-వైసీపీ రాళ్ల దాడిలో లోకేశ్ సేఫ్‌
-స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ త‌ల‌పై ప‌డ్డ పెద్ద రాయి
-ఫ‌లితంగా ఎస్సై త‌ల‌కు తీవ్ర గాయం
-దాడిలో మ‌రో కానిస్టేబుల్‌కూ గాయాలైన వైనం

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండ‌లం తుమ్మ‌పూడిలో గురువారం సాయంత్రం హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. విప‌క్ష టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ శ్రేణుల‌పై అధికార వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడికి దిగారు. హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు నారా లోకేశ్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఈ గొడ‌వ జ‌రిగింది.

హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు నారా లోకేశ్ వ‌చ్చార‌ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అనుచ‌రులు పెద్ద ఎత్తున అక్క‌డికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆ త‌ర్వాత వైసీపీ శ్రేణులు నారా లోకేశ్‌తో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పైకి రాళ్లు రువ్వ‌డం మొద‌లుపెట్టాయి. ఈ సంద‌ర్భంగా నారా లోకేశ్ నిలుచున్న చోటే… ఆయనకు అతి స‌మీపంలోనే పెద్ద రాయి వ‌చ్చి ప‌డింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో లోకేశ్‌కు ఎలాంటి ముప్పు వాటిల్ల‌లేదు.

ఈ ఘ‌ట‌న‌లో నారా లోకేశ్ నిలుచున్న చోటుకు అతి స‌మీపంలో ఓ పెద్ద రాయి వ‌చ్చి ప‌డింది. అయితే ఈ ఘ‌ట‌న‌లో లోకేశ్‌కు ఏమీ కాకున్నా… వైసీపీ రాళ్ల దాడిని నిలువ‌రించేందుకు య‌త్నించిన పోలీసుల‌కు మాత్రం గాయాల‌య్యాయి. వైసీపీ శ్రేణులు విరిసిన ఓ పెద్ద రాయి విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ ఎస్సై త‌ల‌పై ప‌డింది. దీంతో ఆయ‌న త‌ల‌కు తీవ్ర గాయం అయ్యింది. మ‌రోవైపు వైసీపీ రాళ్ల దాడిలో మ‌రో కానిస్టేబుల్‌కు కూడా గాయాల‌య్యాయి.

Related posts

దళితబంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టం: కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

విభజన అంశాలపై ఉండవల్లి తీవ్ర వ్యాఖ్యలు…స్పందించిన వైసీపీ !

Drukpadam

ఢిల్లీలో మమత బిజీబిజీ.. నేడు మోదీతో భేటీ!

Drukpadam

Leave a Comment