Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాయి గణేష్ మరణానికి కారణమైనవారిని వదిలే ప్రసక్తి లేదు …బండి సంజయ్

సాయి గణేష్ మరణానికి కారణమైనవారిని వదిలే ప్రసక్తి లేదు …బండి సంజయ్
సాయిగణేష్ పరిస్థితి విషంగా ఉండే మరణవాగ్మూలం తీసుకోలేదు
కమ్మ సంఘ ఎన్నికల్లో మంత్రి మద్దతు దారులును నమ్మలేదు

సాయి గణేష్ ఆత్మహత్య కారణమైన వారు ఎంతటివారినైనా వదిలే ప్రసక్తి లేదని వారిని దేవుడు కూడా కాపాడలేడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు . గతనెలలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వచ్చిన సంజయ్ విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ మంత్రి ప్రోద్బలంతోనే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని , అంబెడ్కర్ రాజ్యాంగం కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలౌతుందని విమర్శలు గుప్పించారు . సాయి గణేష్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ,మంత్రి అతని అనుచరులు పోలీసులపై వత్తిడి తెచ్చి 16 కేసులు పెట్టించారని ఇదెక్కడి ఘోరమని అన్నారు. అధికారం ఉందికదా అని ప్రశ్నించేవారిని వేధించడం కేసులు పెట్టడం పై మంది పడ్డారు .

సాయి గణేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపిన మరణ వాగ్మూలం తీసుకోకపోవడం ఎవరిది నేరమని ప్రశించారు . ఎందుకు మరణవాగ్మూలం తీసుకోలేదు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు . తప్పకుండా సాయి గణేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని దోషులు ఎంతటివారైనా శిక్ష పడేలా చేస్తుందని పేర్కొన్నారు .

ఖమ్మం… కమ్మ సంఘం ఎన్నికల్లోనే మంత్రి మద్దతు దారుడిని కమ్మ కులస్తలు నమ్మలేదని, మంత్రి పువ్వాడ అజయ్ కమ్మ కులం లో చెడ పట్టరాని అనుకుంటున్నారు.. దుయ్యబట్టారు .
వ్యాపారం కోసం పార్టీలు మారే సంస్కారం మంత్రిది ఎలాంటి వారిని చట్ట ప్రకారం శిక్షించే విధంగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు . విలేకర్ల సమావేశంలో తమిళనాడు బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి,భారతీయ కిషన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ   ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు .

Related posts

చస్తే కూడా శ్మశానంలో చోటు దొర‌క‌ట్లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ‌?: రేవంత్ రెడ్డి

Drukpadam

మూడు రాజధానుల ఏర్పాటు ఖాయం: తేల్చిచెప్పిన సజ్జల

Drukpadam

ఈటల బాటలో కొండా విశ్వేశ్వర రెడ్డి …బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం…

Drukpadam

Leave a Comment