Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పేదలకు గుడిశెలు ఇవ్వమంటే అరెస్ట్ లు చేస్తారా ? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆగ్రహం!

పేదలకు గుడిశెలు ఇవ్వమంటే అరెస్ట్ లు చేస్తారా ? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆగ్రహం!
-ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
-ఇది ప్రజాస్వామ్యమా …పోలీస్ స్వామ్యమా??
-ఇదే ప్రభుత్వ వైఖరైతే మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరిక …
-తమ్మినేని ,సుదర్శన్ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాపిత నిరసనలు
-ఖమ్మం , వరంగల్ , నల్గొండ జిల్లాల్లో నిరసనల వెల్లువ

వరంగల్ నగరంలో పేదలకు ఇల్లు ,ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ వరంగల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు వెళుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ,పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ లను రాయపర్తి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది . ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వమంటే అరెస్ట్ చేస్తారా ? అని మండి పడ్డారు . రాయపర్తి పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు గురించి అడగటం నేరమా ? అని తమ్మినేని ప్రశ్నించారు . ఇది ప్రజాస్వామ్యమా ? పోలీస్ స్వామ్యమా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు .ప్రభుత్వ వైఖరి విధే విధంగా కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు . తమ్మినేని ,సుదర్శన్ అరెస్టులకు నిరసనగా వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

ఖమ్మం లో

వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో వేలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలను పోలీసులు బుల్డోజర్లతో కూలగొట్టి, తగులబెట్టి,
అక్రమ అరెస్టులకు నిరసనగా బుధవారం ఖమ్మంలో సిపిఎం జిల్లా కమిటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. జిల్లా ఆఫీసు సుందరయ్య భవనం నుండి ఎన్‌.ఎస్‌.పి. క్యాంప్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిరచారు. హన్మకొండ, వరంగల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ భూమిలో గత నెల రోజులుగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీటిని బుల్డొజర్లతో కూల్చివేయడమే కాకుండా, వాటిని కాల్చి, నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. ఈ చెరువులపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వ్యాపారం చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం పేదలపై మాత్రం తమ ప్రతాపం చూపుతున్నది. అక్రమ అరెస్టులు, కేసులతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని సీపీఐ (ఎం) హెచ్చరిస్తున్నది.

నిరంతరం పేదలపక్షాన పోరాడుతూనే ఉంటామని గుడిసెవాసులకు సీపీఐ (ఎం) భరోసానిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ (ఎం) పోరాటాల ఫలితంగా పేదలకు ప్రభుత్వం ఇళ్ళ స్థలాల పట్టాలు మంజూరు చేసింది. ఆ స్థలాల్లో ప్రభుత్వం ఖాళీ స్థలం వున్న ప్రతి పేద వారికి 3 లక్షల రూపాయలు సహాయం చేసి ఇండ్లు కట్టిస్తామని గతంలో ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు యివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఐ (ఎం) నిర్వహించే పోరాటాలకు మద్దతివ్వాలని ప్రజాసంఘాలకు, ఇతర రాజకీయ పార్టీలకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రం, మాజీ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిల్లా కమిటి సభ్యులు అఫ్రోజ్‌ సమీనా, నందిపాటి మనోహర్‌, ఎస్‌.నవీన్‌రెడ్డి, దొంగల తిరుపతిరావు, పిన్నింటి రమ్య, ఆర్‌.ప్రకాష్‌, ఖమ్మం 2 టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, నాయకులు చింతల రమేష్‌, కత్తుల అమరావతి, వై.శ్రీనివాసరావు, వాసిరెడ్డి వీరభద్రం, పామర్తి వాసు, వడ్రాణపు మధు, పి. నాగేశ్వరరావు, ప్రతాపనేని వెంకటేశ్వరరావు, నకిరికంటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ బాద్ జిల్లాలో

. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ హన్మకొండ లో పేదలు వెసుకున్న గుడిసెలను పంపిణీ చేసి వారికి పట్టాలు ఇచ్చి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు వెళుతున్న సందర్భంలో రాయపర్తి పోలీసులు అరెస్టు చెయాడాన్ని ఖండిస్తూ నెల్లికుదురు మండల కేంద్రం లో సిపిఎం మండల కమిటీ అధ్వర్యంలో నిరసిస్తూ అరెస్టు చెసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్. బాబుగౌడ్. ఇసంపేల్లి సైదులు. తొటనర్సయ్య. పి.పుల్లయ్య. భూక్య బిక్షపతి.సొమ్లా తదితరులు పాల్గొన్నారు.

 

 

Related posts

పంజాబ్ క్రీడాకారిణికి మంత్రి కేటీఆర్ సాయం.. వ్యక్తిగతంగా రూ. 15 లక్షలు అందజేత!

Drukpadam

ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు… బాంబే హైకోర్టు సంచలన తీర్పు…

Drukpadam

ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధాని మోదీకి, నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు…సీఎం చంద్రబాబు

Ram Narayana

Leave a Comment