Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అక్రిడేషన్ కు 30 నుంచి నలభై వేలా…? పక్కదార్లు పడుతున్న ప్రభుత్వ నిబంధనలు!

అక్రిడేషన్ కు 30 నుంచి నలభై వేలా…? పక్కదార్లు పడుతున్న ప్రభుత్వ నిబంధనలు!
-ఎం ప్యానల్ లో ఉంటె పంటపండినట్లే
-పెద్ద పత్రికలు సైతం ఇదే అదునుగా విలేకర్ల  పై వత్తిడి…..
-మండలంలో 20 పత్రికలు కట్టించగలిగితేనే అక్రిడేషన్ అంటున్న కొన్నిసంస్థలు ..
-అక్రిడేషన్ కావాలంటే ఇంత సమర్పించు కోవాల్సిందే..

 

జర్నలిస్టులకు అక్రిడేషన్ ల జారీకి ప్రభుత్వం సిద్దమైన సందర్భంగా యాజమాన్యాలు కార్డులను (అన్నికాదు ) సంతలో సరుకుగా అమ్ముకుంటున్నాయి. ఇది అత్యంత దారుణంగా మారింది . ఒక్క అక్రిడేషన్ పొందాలంటే 30 నుంచి నలబై వేలరూపాయలు చెల్లిస్తే చాలు …అతనికి గతంలో అనుభవం ఉందా? లేదా? అనేదానితో పనిలేదు ..ఏకంగా అతనిపేరు లిస్టులో ఉంటుంది. కార్డు వస్తుంది. ఆతను పత్రికలో పనిచేస్తున్నాడా? లేదా? అనేదానితో కూడా నిమిత్తం లేకుండా కార్డులు రావడంతో కొంతమంది జర్నలిస్టులు గా అవతారం ఎత్తుతున్నారు .

దీనికి తోడు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు యాజమాన్యాల పాలిట వరంగా మారాయి. యాజమాన్యాల నుంచి లెటర్ ఉండాలని నిబంధనల్లో పెట్టడంతో మొదట తమ పత్రికను ఎం ప్యానల్ లో వుండేట్లుగా చూసుకొని అక్కడనుంచి జిల్లాకు ఇన్ని చొప్పున అక్రిడేషన్ లు ఇవ్వాలనే నిబంధన ఉండటంతో అక్రిడేషన్లు అంగట్లో సరుకుగా మార్చారు . ఇది పెద్ద పత్రికలవాళ్ళకు,ఏళ్లతరబడి వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారికి కూడా ఇబ్బందిగా మారింది.

నిబంధలు ప్రకారం కనీసం 3 సంవత్సరాలు ఏదైనా పత్రికలో పనిచేసిన అనుభవం ఉంటె అక్రిడేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు …కానీ ఆ నిబంధనలు ఎక్కడ పాటించడంలేదు … వాటిని పట్టించుకున్న పాపాన అధికారులు సైతం పోవడంలేదు …రెండు సంవత్సరాలకు ఒకసారి జారీచేస్తే అక్రిడేషన్ కార్డు తో పాటు బస్సు పాస్, రైల్వే పాస్ వస్తుంది. అంతే కాకుండా అక్రిడేషన్ ఉంటె ఇంటిస్థలం ,లేదా డబుల్ బెడ్ రూమ్ లాంటివి వస్తాయనే ఆశతో అవసరమైతే వడ్డీలకు తెచ్చి , బంగారం లాంటివి ఉంటె తాకట్టు పెట్టి మరి అక్రిడేషన్ లు పొందేందుకు పరుగులు పెడుతున్న సంఘటనలు కోకొల్లలు . ఇక పేపర్లు సర్క్యులేషన్ సరేసరి …దీనిపై ప్రభుత్వ యంత్రాగం పర్వవేక్షణ లేదు …

వేతనాలువేతన సంఘ సిఫారసులు…

ఇక వేతనాలు ఇవ్వడంలో చాల యాజమాన్య సంస్థలు వేతన సంఘ సిఫారసులు అమలు చేయడంలేదు …. దీన్ని పర్వేక్షించి అమలు చేయాల్సిన కార్మిక శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. చాల యాజమాన్యాలు విలేకరులను కేవలం ప్రకటనలు సేకరించే యంత్రాంగం లాగా చూస్తున్నాయి. వారికీ ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా వచ్చే ప్రకటనల్లో కమిషన్ లు ఇస్తూ వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. ఇప్పుడు కొన్ని యాజమాన్యాలకు కావాల్సింది వార్తలు రాయగలిగే విలేకర్లు కాకుండా జీతాలు లేకుండా ప్రకటనలు సేకరించేవారు కావాలి … ఇక ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను మాత్రం యాజమాన్యాలు బారాబర్ పొందుతున్నాయి. పాలకులు కూడా యాజమాన్యాలకు రాయితీలు ఇస్తూ , అక్రిడేషన్ లలో , ఇళ్ల స్థలాల్లో ,హెల్త్ కార్డుల జారీలో విలేకరులను మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

అసలు అక్రిడేషన్ అంటే ….

అక్రిడేషన్ అంటే గుర్తింపు కార్డు ….ఇది మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగి లేదా పార్ట్ టైం వ్యక్తులకు సమాచార సేకరణకు ప్రభుత్వం ఇచ్చే గౌరవప్రదమైన కార్డు …ఒకప్పుడు అక్రిడేషన్ ఉన్న కరెస్పాండంట్ లేదా విలేఖరికి అధికారులు ,రాజకీయనాయకులు , ఉద్యోగులు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల ,సమాజంలో ఉన్న ఇతర వర్గాల వద్ద మంచి గుర్తింపు ఉండేది. సమాచార విస్ఫోటనం జరిగింది. ప్రింట్ మీడియా కు తోడు చాటిలైట్ ఛానల్స్ , డిజిటల్ మీడియా వచ్చింది…అంతకుముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మండల వ్యవస్థ రావడంతో మండల విలేకర్లు , జిల్లా పేజీలు వచ్చాయి. దీంతో జర్నలిస్ట్ సంఘాల విజ్ఞప్తి మేరకు నాటి ప్రభుత్వం మండల విలేకర్లకు కూడా కార్డులు ఇచ్చింది. దీంతోపాటు కొన్ని సౌకర్లు కూడా కల్పించింది.

మండల వ్యవస్థ రాకముందు వందల్లో ఉన్న విలేకర్లు వేలు అయ్యారు . బస్సు పాస్ ,రైల్వే పాస్ లు ఇవ్వడంతో అక్రిడేషన్ కార్డు లకు డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ నుంచే అక్రిడేషన్ కార్డులు పక్కదార్లు పెట్టె ప్రక్రియకు తెర లేచింది. దీంతో నిజంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టలు ఇబ్బందులు మొదలైయ్యాయి. దీనికి తోడు వెబ్ , మీడియా , డిజిటల్ మీడియా , యూట్యూబ్ ఛానల్స్ రావడంతో జర్నలిస్టులు పెరిగారు . అక్రిడేషన్ లను కేవలం ప్రింట్ మీడియా , చాటిలైట్ ఛానల్స్ కు ,కేబుల్ టీవీ చానళ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఎం ప్యానల్ లో ఉన్న చిన్నపత్రికలనుంచి అక్రిడేషన్ లు పొందేందుకు, వార్నించి లెటర్స్ తెచ్చుకునేందుకు పరుగులు పెడుతున్నారు . దీంతో అక్రిడేషన్ లకు డిమాండ్ పెరిగింది.

ఖమ్మం లో మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే…

అర్హులందరికీ అక్రిడేషన్ లు ఇవ్వాలని టీయూడబ్ల్యూ జె(ఐ జె యూ ) సంఘం డిమాండ్ .అనర్హులు కూడా అక్రిడేషన్ కార్డులు తీసుకుంటున్నారని ప్రభుత్వ వాదన …అందుకు ఎవరు అనర్హులు అనేది తేల్చాల్సిన భాద్యత ఉన్న ప్రభుత్వ యంత్రాంగం దాన్ని నుంచి తప్పుకుని అందరికి అన్యాయం చేయాలనీ అక్రిడేషన్ లలో కోత విధించాలని చూస్తున్నది. ఖమ్మం వచ్చిన మంత్రి కేటీఆర్ ను టీయూడబ్ల్యూ జె (ఐ జె యూ ) ఆధ్వర్యంలో అందరికి అక్రిడేషన్ లు ఇవ్వలని కోరగానే ఆయన నుంచి వచ్చిన మాట… మనం గతంలో 19 వేల అక్రిడేషన్ లు ఇచ్చాం …గుజరాత్ రాష్ట్రంలో కేవలం 2 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు . అయితే అక్కడ మండల వ్యవస్థలేదుకదా సార్ …మనదగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వం మండల వ్యవస్థ పెట్టిన దగ్గరనుంచి ఉంటుంది.అని చెపితే విన్నారు తప్ప న్యాయం చేస్తామని చెప్పలేదు …

అక్రిడేషన్లు ఎక్కువ ఇస్తున్నామని చెప్పి తగ్గించడం కాదు …ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ప్రభుత్వం యంత్రాంగం చూడాలి …అంతే కానీ ఆ పేరుతొ అక్రిడేషన్లలో కోత విధించడం…సీనియర్లకు ,అర్హులైన వారికీ అక్రిడేషన్లు లేకుండా చేయడం ఎంతమాత్రం సరైంది కాదు … ఇది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి న్యాయం చేయాలనే డిమాండ్ జర్నలిస్ట్ సమాజంలో బలంగా ఉంది…

Related posts

ఖమ్మం ఐ ఎం ఎ ఆధ్వర్యంలో టెలిమెడిసిన్ -అందుబాటులో 31 మంది డాక్టర్లు

Drukpadam

నేను ఆరోగ్యంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందవద్దు: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి!

Drukpadam

హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Drukpadam

Leave a Comment