Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

16 ఏళ్ల‌కే ముస్లిం యువ‌తులు పెళ్లి చేసుకోవ‌చ్చు…పంజాబ్‌, హ‌ర్యానా కోర్టు సంచ‌ల‌న తీర్పు!

16 ఏళ్ల‌కే ముస్లిం యువ‌తులు పెళ్లి చేసుకోవ‌చ్చు… పంజాబ్‌, హ‌ర్యానా కోర్టు సంచ‌ల‌న తీర్పు!
16 ఏళ్ల‌కే పెళ్లి చేసుకున్న ముస్లిం యువ‌తి
ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ పంజాబ్‌, హ‌ర్యానా కోర్టును ఆశ్ర‌యించిన వైనం
యువ‌తి వివాహాన్ని గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన కోర్టు
ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం ముస్లిం యువ‌తికి ఆ హ‌క్కు ఉందంటూ వ్యాఖ్య‌

యువ‌తుల వివాహ వ‌య‌స్సుకు సంబంధించి పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టు సోమ‌వారం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ముస్లిం యువ‌తి 16 ఏళ్లు నిండ‌గానే త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌క్తిని వివాహం చేసుకోవ‌చ్చంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువ‌తులు త‌మ‌కు ఇష్ట‌మైన యువ‌కుడిని పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన హైకోర్టు… ముస్లిం యువ‌తి 16 ఏళ్లు నిండ‌గానే పెళ్లి చేసుకునేందుకు అర్హురాలేన‌ని తేల్చి చెప్పింది.

16 ఏళ్లు నిండిన ఓ యువ‌తి త‌న‌కు ఇష్ట‌మైన వాడిని పెళ్లి చేసుకుని త‌మ‌కు ర‌క్ష‌ణ కల్పించాలంటూ పంజాబ్‌, హ‌ర్యానా కోర్టును ఆశ్ర‌యించింది. స‌ద‌రు యువ‌తి పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు ష‌రియా చ‌ట్టాన్ని ఊటంకిస్తూ వారి వివాహాన్ని గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతికి త‌న‌కు ఇష్ట‌మైన వాడిని పెళ్లి చేసుకునే హ‌క్కు ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

Related posts

ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు…

Drukpadam

The Secrets of Beauty In Eating A Balanced Diet

Drukpadam

శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుతమైన అవకాశం.. వర్షాల కారణంగా దర్శనం చేసుకోలేని వారి కోసం..

Drukpadam

Leave a Comment