Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసిన జ‌గ‌దీప్ ధన్‌ఖడ్‌… 

ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసిన జ‌గ‌దీప్ ధన్‌ఖడ్‌… 

  • మోదీ, జేపీ న‌డ్డాలు వెంట రాగా నామినేష‌న్ వేసిన ధన్‌ఖడ్‌
  • నిన్న‌టిదాకా ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్‌గా కొన‌సాగిన జ‌గ‌దీప్‌
  • ఆగ‌స్టు 6న ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌

ఓ వైపు రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతుండ‌గా.. మ‌రోవైపు ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా జ‌గ‌దీప్ ధన్‌ఖడ్‌ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు వెంట రాగా పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ధన్‌ఖడ్‌ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

నిన్న‌టిదాకా ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్నర్‌గా కొన‌సాగిన ధన్‌ఖడ్‌ ను ఎన్డీఏ ఉపరాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పశ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి ధన్‌ఖడ్‌ రాజీనామా చేయ‌గా… దానిని వెంట‌నే రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోందించారు. దీంతో ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికల బ‌రిలోకి దిగేందుకు ఆయ‌నకు మార్గం సుగ‌మం అయ్యింది. వ‌చ్చే నెల 6న ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌కు సంబంధించిన పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

NDA Vice Presidential candidate Jagdeep Dhankar files nomination

Related posts

అష్రఫ్ ఘనీ రూ. 1255 కోట్లతో పారిపోయారు … లేదు లేదు నన్ను షూ కూడా వేసుకోనివ్వలేదు !

Drukpadam

హైద్రాబాద్ ఫిలిం నగర్ లో ఎన్టీఆర్ కు మంత్రి అజయ్ నివాళులు …

Drukpadam

మోదీ కాన్వాయ్‌ను అడ్డగించింది మేమే.. ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాద సంస్థ !

Drukpadam

Leave a Comment