అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్… సింగర్ మూసేవాలా హత్య కేసు నిందితుడు హతం!
-ఇటీవలే సిద్దూ మూసేవాలా హత్య
-ఈ కేసులో ప్రధాన నిందితుడిగా జగరూప్ సింగ్
-ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులకు గాయాలు
పంజాబ్‌లో ఇటీవలే చోటుచేసుకున్న సింగర్ సిద్దూ మూసేవాలా హత్య కేసుకు సంబంధించిన నిందితులు, పోలీసుల మధ్య బుధవారం అమృత్ సర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మూసేవాలా హంతకుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జగరూప్ సింగ్ హతమయ్యాడు. కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రికార్డు అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పంజాబ్‌లో మూసేవాలా హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో కొత్తగా కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం వందల సంఖ్యలో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను తొలగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే మూసేవాలా హత్య ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు… బుధవారం తమకు తారసపడిన నిందితులను అరెస్ట్ చేసే యత్నం చేయగా… పోలీసులపై నిందితులు కాల్పులు జరుపుతూ తప్పించుకునే యత్నం చేశారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జగరూప్ సింగ్ హతమయ్యాడని పోలీసులు నిర్ధారించారు . పోలీసులకు గ్యాంగ్స్టార్స్ కు మధ్య హోరాహోరీ జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులకు కూడా గాయాలైయ్యాని సమాచారం …