Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వర్షంలోనూ లంక గ్రామల్లో  వరదభాదితులవద్దకు సీఎం జగన్!

వర్షంలోనూ లంక గ్రామల్లో  వరదభాదితులవద్దకు సీఎం జగన్!

పంటు, ట్రాక్టర్​పై లంక గ్రామల్లోకి సీఎం జగన్
అంబేద్కర్ కోన‌సీమ జిల్లాలో వరద బాధితులకు పరామర్శ
భారీ వ‌ర్షంలోనూ వ‌ర‌ద బాధితుల‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి
వరద పరిస్థితులు, సహాయక చర్యల వివరాలు అడిగితెలుసుకున్న జగన్
సహాయం అందని వాళ్ళు ఉంటె చేతులెత్తమన్న సీఎం జగన్
సాయం అందింది …అందింది అని నినదించిన ప్రజలు
వరదల్లో వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి డ్రామాలు చేయడంకాదు
భాదితులకు సక్రమంగా సాయం అందేలా చూడాలన్న జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోనసీమలో గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఈ ఉద‌యం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరిన సీఎం వైఎ‌స్ జ‌గ‌న్ అంబేద్కర్ కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్నవరం మండ‌లం జి.పెద‌పూడి చేరుకున్నారు. పెద‌పూడిలో వ‌ర్షంలోనే వ‌ర‌ద బాధితుల వ‌ద్దకు వెళ్లారు. పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్లిన సీఎం గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను పరామర్శించారు.

వ‌ర‌ద‌ల వ‌ల్ల క‌లిగిన న‌ష్టం, ప్రభుత్వం చేప‌ట్టిన స‌హాయ‌క కార్యక్రమాల గురించి నేరుగా బాధితుల‌నే అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం పెద‌పూడి ఫెర్రీ నుంచి పంటుపై లంక గ్రామాల‌కు చేరుకున్న సీఎం వ‌ర‌ద బాధితుల‌ను క‌లిసి వారిని ప‌రామ‌ర్శించారు. వర్షం వల్ల రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో సీఎం జగన్ ట్రాక్టర్ పై కొన్ని గ్రామాల్లోకి వెళ్లారు. ప్రభుత్వ సహాయక శిబిరాల్లో ఉన్న వరద బాధితులను అక్కడ అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పరంగా బియ్యం ,పప్పులు నూనె , ఉల్లిగడ్డలు , పశువులకు మేత అందిందా లేదా అని వరద భాదితులను అడిగారు . అందింది …అందింది అని ప్రజలు బిగ్గరగా అరిచారు . అందని వారు ఉంటె చేతులు ఎత్తాలని అడగగా ఒక్కరు కూడా చేతులు వేత్తలేదు …అందినవారు ఎత్తండి అని అడగ్గా అందురు చేతులు ఎత్తు తమకు సాయం అందిందని చెప్పారు . ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు అందాయని అడగ్గా అందాయని ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీంతో సీఎం జగన్ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ,సచివాల సిబ్బంది పనితీరును అభినందించారు . వరదబాధితులకు సాయం అంటే సీఎం వచ్చి వరదల్లో పర్యటించి ఫోటోలకు ఫోజులిచ్చి డ్రామాలు చేయడం కాదని ప్రజలకు సాయం అందించి ఆడుకోవడమని అని చంద్రబాబు విమర్శలకు చురకలు అంటించారు . లంక గ్రామాలకు వసిష్ఠ గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తామని ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు .

Related posts

ఆవిష్కరణల్లో మేటి ఐఐటీలు.. దేశంలోని టాప్-10 విద్యాసంస్థలు ఇవే!

Drukpadam

హెటెరోపై సీబీఐ కేసు కొట్టివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు!

Drukpadam

సమ్మక్క సారలమ్మ జాతరకు 75 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్ !

Drukpadam

Leave a Comment