Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం: డీజీపీ మహేందర్ రెడ్డి…

తెలంగాణలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం: డీజీపీ మహేందర్ రెడ్డి…
-తెలంగాణలో అత్యధిక కేసులంటూ ఎన్సీఆర్బీ రిపోర్ట్
-నేరాలు పెరిగిపోతున్నాయంటూ మీడియా కథనాలు
-అవగాహన కోసమే కేసులు నమోదు చేస్తున్నామన్న డీజీపీ

తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్న నేషనల్ రికార్డ్స్ బ్యూరో నివేదిక తో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి విభేదించారు . ఇది వాస్తవం కాదని అన్నారు . ప్రజల అవగాహనా కోసమే కేసులు నమోదు చేస్తున్నామని వివరణ ఇచ్చారు . వివిధ రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణాలో క్రైమ్ రేటు తక్కువగానే ఉందనే అభిప్రాయాలూ ఉన్నాయి.

తెలంగాణలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయంటూ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తెలంగాణలో నేరాల సంఖ్య పెరుగుతోందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కేసులు, మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు.

రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందన్న వార్తలు అవాస్తవం అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల అవగాహన కోసమే కేసులు నమోదు చేసి అప్రమత్తం చేస్తున్నామని వివరణ ఇచ్చారు. సైబర్ క్రైమ్ కేసుల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయని, సైబర్ నేరగాళ్లు ఝార్ఖండ్, బీహార్, బెంగాల్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

Related posts

ఢిల్లీ పోలీసుల ముందు లొంగిపోయిన ‘పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన సూత్రధారి’

Ram Narayana

నీట్ కు వ్యతిరేకంగా బీజేపీ ఆఫీసుపై పెట్రోల్ బాంబులతో దాడి!

Drukpadam

బాంబు బెదిరింపులు కూడా కాపీ, పేస్టే.. పోలీసుల కస్టడీలో ఢిల్లీ యువకుడు…

Ram Narayana

Leave a Comment