Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నూతన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

నూతన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
-నూతన న్యాయమూర్తిని సత్కరించిన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి
సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం
48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం
రమణపై శుభాకాంక్షల వెల్లువ
ట్విట్టర్ లో స్పందించిన ఏపీ సీఎం
న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంచాలంటూ గవర్నర్ ఆకాంక్ష

సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా పదవీప్రమాణం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా జస్టిస్ ఎన్వీ రమణకు విషెస్ తెలియజేశారు. ‘భారత చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న ఎన్వీ రమణ గారికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
అంతకుముందు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. “మీ చారిత్రాత్మక తీర్పుల ద్వారా భారత న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, హుందాతనాన్ని మరింత విస్తరింప చేస్తారని ఆశిస్తున్నాను. ఈ క్రమంలో మీపై పూరీ జగన్నాథ్, తిరుమల వెంకటేశ్వరుడి కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా శుభాకాంక్షలు తెలిపారు.

సీజేఐ ఎన్వీ రమణను సత్కరించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఈరోజు సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణ
శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు
జస్టిస్ రమణకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసిన వైవీ సుబ్బారెడ్డి
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఈరోజు బాధ్యతలను స్వీకరించిన జస్టిస్ ఎన్వీ రమణకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఢిల్లీలో జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ పర్యాటక కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో సీజేఐ దంపతులకు టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి జస్టిస్ రమణను స్వామి వారి వస్త్రంతో సత్కరించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తదితరులు ఎన్ వి రమణ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు వాడు దేశ అత్యున్నత న్యాస్థానం ప్రధాన న్యాయ మూర్తిగా నియమించబడటం పట్ల తెలుగు ప్రజల్లో హర్షతి రేఖాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్వగ్రామంలో నందిగామ నియోజకవర్గంలో పండగ వాతావరణం ఏర్పడింది . గ్రామం ప్రజలు అందరు ఉత్సవాలు జరుపుకున్నారు .

Related posts

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో ఆగ్రహజ్వాలలు…సీఎల్పీ నేతను కలిసిన సీనియర్లు …

Drukpadam

ఆజాద్ దెబ్బకు జమ్మూ కశ్మీర్​లో కాంగ్రెస్ ఖాళీ!

Drukpadam

శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం …!

Ram Narayana

Leave a Comment