Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో దొరికిన డబ్బెంత?…ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?: కిషన్ రెడ్డి

మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో దొరికిన డబ్బెంత?…ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?: కిషన్ రెడ్డి
-ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్న కిషన్ రెడ్డి
-పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరేనని ఆరోపణ
-మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే కొత్త నాటకమని విమర్శ
-ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాకర్షణ కలిగిన నేతలా అని ప్రశ్న

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై… టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మునుగోడు ఎన్నికల వేళ కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పట్టుబడిన నలుగురు ఎమ్మెల్యేలు మరికొందరు స్వాములు ఇతరుల విషయంపై రాష్ట్రంలో ఉత్కంఠత ఏర్పడింది. కోట్లురూపాయలు ఉపయోగించి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కేసీఆర్ చేసి మునుగోడు ఎన్నికల నుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలతో బిజెపి మనోధైర్యాన్ని దెబ్బ కొట్టలేరని అన్నారు . ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కెసిఆర్ చర్యలపై కేంద్ర మంత్రి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే సంస్కృతి కెసిఆర్ కు మాత్రమే ఉందన్న విషయం అందరికీ తెలుసు అన్నారు.

గతంలో లో వివిధ పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది కేసీఆర్ అనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు . కేసీఆర్ మాటలు గురువింద సామెతను తలపిస్తున్నాయని విమర్శలు గుప్పించారు. ఇదే వైఖరి కొనసాగితే కెసిఆర్ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇదేనా మీ రాజకీయం… ప్రజల హృదయాలను గెలవటం ద్వారా నేర్చుకోండి… అంతేకానీ డ్రామాలు నాటకాలు ద్వారా ప్రజలను పిచ్చివాళ్లను చేయవద్దని హితవు పలికారు . తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం కలిగిన వారిని అందువల్ల వారు ఎవరు ఏమి చెపుతున్నారు? . ఎవరు ప్రజల కోసం పని చేస్తున్నారు? ఎవరి స్వార్థం కోసం పని చేస్తున్నారు అనే విషయాలను నిత్యం గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని అందువలన ఓటమి నుండి తప్పించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో పోలీసులు పెద్ద మొత్తంలో సీజ్ చేశారని చెబుతున్న డబ్బు ఎంత?.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ డబ్బును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకువచ్చారా?.. లేదంటే కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు.

అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని కూడా కిషన్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గౌరవిస్తూ… ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరైనా బీజేపీలోకి వస్తామంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయించి మరీ పార్టీలోకి చేర్చుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి లాగిన ఎమ్మెల్యేలతో కేసీఆర్ రాజీనామా చేయించారా? అని ఆయన ప్రశ్నించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందన్న భయంతోనే కేసీఆర్ కొత్త నాటకానికి తెర తీశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. సరిగ్గా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమైందని సర్వేలు తేల్చిచెప్పగా పోలింగ్ కు ముందు రోజు రఘునందన్ రావు ఇంటిపై ఎలా దాడి చేశారో… ఇప్పుడు మునుగోడు ఎన్నికలో ఓటమి భయంతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. అసలు బీజేపీ కొనుగోలు చేయడానికి యత్నించిందన్న నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాకర్షణ కలిగిన నేతలా? అని ఆయన ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ దాడులంటూ సానుభూతి పొందేందుకు చేసిన యత్నం విఫలం కావడంతో డీల్ డ్రామాకు కేసీఆర్ రూపకల్పన చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Related posts

ఏపీలో జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించిన చంద్రబాబు… ఏ జిల్లాకు ఎవరంటే…!

Ram Narayana

Nicole Kidman on Aging and Her Favorite Skin Care Products

Drukpadam

బ్యాంకు ల బడాయి … రైతు 31 పైసల బాకీకి నో డ్యూ సర్టిఫికెట్ నిరాకరణ !

Drukpadam

Leave a Comment