Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి భుజం తట్టిన ప్రధాని మోడీ !

పొంగులేటి భుజం తట్టిన ప్రధాని మోడీ !
-సుధాకర్ జీ కైసహై అన్న ప్రధాని
-రాష్ట్ర పర్యటనలో తెలంగాణ నాయకుల పనితీరు మెచ్చుకున్న ప్రధాని
-ప్రధాని మోడీని ఘనంగా సత్కరించిన బీజేపీ నాయకులు

 

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా హైద్రాబాద్ లోని బేగం పేట విమానాశ్రయం వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ నేతల పనితీరు పట్టుదల , పోరాటపటిమను ప్రసంశించారు .ఇదే పద్దతిలో ముందుకు సాగాలని హితబోధ చేశారు .రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పడాలని ,అవినీతిపాలన అంతం కావాలని పిలుపు నిచ్చారు. మునోగుడులో ప్రజల తీర్పు కేసీఆర్ పాలనపై ప్రజల అసంతృప్తికి అద్దంపడుతుందని అన్నారు .రానున్న ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని ప్రధాని అన్నారు .దీంతో మునుగోడు ఎన్నికల ఓటమితో ఢీలాపడ్డ బీజేపీకి ప్రధాని మోడీ మాటలు బూస్ట్ లా పనిచేశాయి. ప్రధానిని పలువురు నేతలు సత్కరించారు. ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్సీ ,బీజేపీ తమిళనాడు సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రధాని మోడీని బీజేపీ కండువాతో సత్కరించగా ,క్యాహై సుధాకర్ జీ అంటూ పలకరించారు. సుధాకర్ రెడ్డి కల్పించుకొని ప్రధానికి ఎదో చెప్పారు .కొద్దీ చూపు సుధాకర్ రెడ్డి మాటలను వింటూ ప్రధాని భుజం మీద చేయివేసి ప్రశంసించారు .

 

Related posts

కేసీఆర్, జగన్ ఇద్దరూ తోడు దొంగలు అంటున్న కేశినేని నాని…

Drukpadam

భూములు అమ్ముతూ రాష్ట్రాన్ని నడుపుతోంది తెలంగాణ మాత్రమే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Ram Narayana

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ …మోడీ ప్రభుత్వంపై విమర్శలు …

Drukpadam

Leave a Comment