Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఫైటర్ షర్మిల …అడ్డంకులమధ్య 3500 కి .మీ పాదయాత్ర !

ఫైటర్ షర్మిల …అడ్డంకులమధ్య 3500 కి .మీ పాదయాత్ర !
-ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతున్న వైనం
-నర్సంపేట నియోజకవర్గంలో రాళ్లదాడి
-పోలీసులు అరెస్ట్ … హైద్రాబాద్ కు తరలింపు
-హైద్రాబాద్ లో సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ కు యాత్ర
-అడ్డుకున్న పోలీసులు …అయినా కారు దిగని షర్మిల
-క్రైన్ సహాయంతో కార్ లో ఉన్న షర్మిలను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
-ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్న రాజకీయపార్టీలు

 

ఫైటర్ అంటే షర్మిల …షర్మిల అంటే ఫైటర్… ఇది ఈరోజు తెలంగాణ అంతటా మార్మోగుతున్నమాట … ఆమె సివంగి ,చిచ్చరపిడుగు అన్నవాళ్ళు లేకపోలేదు … వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర షర్మిల పాదయాత్ర పై టీఆర్ యస్ జరిపిన దాడి ఆమెకు మంచి మైలేజీని ఇచ్చిందనే చెప్పాలి . ఇది ప్రభుత్వం కావాలని చేసిందా ? లేక షర్మిల కు వస్తున్నా మైలేజీని అడ్డుకట్ట వేయటానికి చేసిందా అనే మీమాంస కలుగుతుంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర మరిచి పోవాలంటే కౌంటర్ గా ఎదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఇలా చేసిందని బీజేపీ లోని కొందరు అంటున్నారు . ఇందులో వాస్తవం ఎంతున్నా షర్మిల చుట్టూ వార్త మాధ్యమాలు తిరిగాయి. సంజయ్ యాత్రను పెద్దగా పట్టించుకోలేదు .

…షర్మిల పార్టీనా ? ఆ ఏముందిలే అని నిట్టూర్చిన వాళ్లకు ఆమె పార్టీ అంటే ,ఆమె అంటే ఏమిటో టీఆర్ యస్ పుణ్యమా అని బయట ప్రపంచానికి తెలిసింది. ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టినప్పప్పుడు ఎగతాళి చేసినవారు సైతం ఆమె తెగువ , పట్టుదల పోరాట పటిమ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు . ఐరన్ లేడీ అని కొందరు అంటుంటే ,ఆమె సివంగి అని మరికొందరు అంటున్నారు . నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని మంగళవారం , మంగళవారం ఆమె చేస్తున్న దీక్షలపై మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం మరదలని ఎగతాళిగా మాట్లాడితే ఎవడ్రా నీకు మరదలు నాలుకకొస్తా అంటూ బదులిచ్చారు . ఎక్కడకు వెళ్లిన అక్కడ స్థానిక సమస్యలపై మాట్లాడుతూ ప్రజల మనస్సులను గెలుచుకొనే ప్రయత్నం చేస్తున్నారు .

 

ఆమె పాదయాత్రలో తన పదునైన మాటలతో ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులకు సైతం ఆమె అదరటంలేదు, బెదరటంలేదు . ఇబ్బందులు తమకు లెక్కకాదని ప్రజల తరుపున పోరాడతానని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు . వారికీ మంచి చేసేందుకు ఏన్ని కష్టాలైనా ఎదుర్కొంటు ముందుకు సాగుతానని అంటున్నారు . ప్రభుత్వాన్ని తన పదునైన ప్రసంగాలతో ఉతికి ఆరేస్తున్నారు. రాజన్న రాజ్యం తెస్తామంటు ఆ పథకాలను వివరిస్తున్నారు . కేసీఆర్ పరిపాలనపై ప్రజలకు నమ్మకంపోయిందని ప్రభుత్వ చర్యలు ప్రజలకు నచ్చటం లేదనే అభిప్రాయాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు . పట్టుదలగా ఆమె సాగిస్తున్న పాదయాత్ర వల్ల, ఆమె పట్ల రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. ఆమె పార్టీ పట్ల యువత ఆకర్షణకు కారణమౌతుంది. ముందు ఆమె పార్టీని గురించి అస్సులు పట్టించుకోని వాళ్ళు సైతం ఆమె పాదయాత్ర పై ఆసక్తి చూపుతున్నారు . ఆమె ఏమి చెబుతున్నారో వినాలనే ఉత్సుకత కనబరుస్తున్నారు . ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఏపీ సీఎం జగన్ చెల్లెలుగా ఆమె తెలుగు రాష్ట్ర ప్రజలకు చిరపరిచితురాలు . అందుకే ఆమె పార్టీని తెలంగాణాలో విస్తరించేందుకు ఉన్న అడ్డంకులను సైతం లెక్క చేయక వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు .

తెలంగాణాలో పార్టీ పెట్టి వైయస్సార్ సంక్షేమ పాలన తెస్తామని చెబుతూ రాష్ట్రమంతటా చేస్తున్నపర్యటనలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది . ఒకటి కాదు , రెండు కాదు ఇప్పటికే 3500 కి .మీ మేర పాదయాత్ర చేశారు . ఒక మహిళా ఇన్ని వేల కి .మీ పాదయాత్ర చేయడం పై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనపై ఆమె విరుచుకుపడుతున్న తీరుకు ప్రజల నుంచి స్పందన వస్తుంది.

వరంగల్ జిల్లా నర్సంపేట లోని లింగగూడం వద్ద టీఆర్ యస్ కార్యకర్తల ఆధ్వరంలో జరిగిన దాడిని పలు రాజకీయపార్టీల నాయకులూ ఖండించారు . ఒక ఆడకూతురుపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించడం గమనార్హం . ఆమెను కారుతో సహా అరెస్ట్ చేయడం,కారులో ఉండగానే క్రైన్ తో ఆమె లాక్కుని పోవడం దారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ సైతం ఈ చర్యలను తప్పు పట్టారు . కాంగ్రెస్ ,బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండించారు .

Related posts

అంబేద్కర్ విశ్వమానవుడు … ఆయన జీవితం అందరికి ఆదర్శప్రాయం …సీఎం కేసీఆర్

Drukpadam

పాలేరు ఎమ్మెల్యే కందాల, పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి ఫైర్ …

Drukpadam

ఫిరాయింపుల మాస్టర్ కేసీఆర్…కిషన్ రెడ్డి విమర్శ!

Drukpadam

Leave a Comment