Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్!

బద్దలైన మౌంట్ సెమేరు అగ్నిపర్వతం.. 8 కిలోమీటర్ల వరకు డేంజర్ జోన్!

  • నిన్న తెల్లవారుజామున 2.46 గంటల ప్రాంతంలో విస్ఫోటనం ప్రారంభం
  • ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు కమ్ముకున్న దట్టమైన పొగలు
  • అగ్నిపర్వతం బద్దలుకావడం ఇది వరుసగా మూడో ఏడాది

ఇండోనేసియాలోని అతి ఎత్తయిన అగ్నిపర్వతం ‘మౌంట్ సెమేరు’ వరుసగా మూడో ఏడాది బద్దలైంది. దీంతో ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుని చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అలాగే, దాదాపు 19 కిలోమీటర్ల మేర బూడిద వ్యాపించింది. అప్రమత్తమైన అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 2 వేల మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఆదివారం తెల్లవారుజామున 2.46 గంటలకు అగ్నిపర్వతం విస్ఫోటన ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితులు తీవ్రంగా మారాయి. దీంతో పర్వతం చుట్టూ 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిని డేంజర్ జోన్‌గా ప్రకటించారు. అలాగే, లావా తాకే అవకాశం ఉన్న బెసుక్ కొబోకాన్ నది ఆగ్నేయ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. జావా ద్వీపంలో ఉన్న ఈ ‘మౌంట్ సెమేరు’ అగ్నిపర్వతం బద్దలుకావడం ఇది వరుసగా మూడో ఏడాది. గతేడాది డిసెంబరులో సంభవించిన పేలుడులో 50 మంది ప్రాణాలు కోల్పోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Related posts

గోవాలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే.. మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఇండిపెండెంట్‌!

Drukpadam

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రకు ఇదే కారణం కావచ్చు: పోప్ ఫ్రాన్సిస్!

Drukpadam

దేశంలో అగ్రగామి విద్యా సంస్థలు ఇవే.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల విడుదల!

Drukpadam

Leave a Comment