Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ట్యాంక్ బండ్ వద్ద ఆమరణ దీక్షకు దిగిన షర్మిల!

షర్మిల దీక్ష భగ్నం.. అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష
దీక్షకు అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకున్న పోలీసులు
కేసీఆర్ పతనానికి ఇదే నాంది అన్న షర్మిల
పాదయాత్రకు అనుమతించకపోవడంతో నిరాహారదీక్ష
న్యాయస్థానాన్ని కేసీఆర్ అగౌరవపరుస్తున్నారని మండిపాటు

తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షకు అనుమతి లేదంటూ ఆమెను అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దీక్షలో కూర్చున్న షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు. అడ్డుకునేందుకు యత్నించిన కార్యకర్తలను పక్కకు తోసేసి ఆమెను తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కేసీఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పదేపదే తప్పు చేస్తున్నారని… ఆయన పతనానికి ఇదే నాంది అని అన్నారు. మరోవైపు షర్మిలపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు.

అంతకు ముందు షర్మిల ట్యాంక్ బండ్ పై ఉన్న అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష దిగిన షర్మిల కేసీఆర్ ప్రభుత్వం తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై మండిపడ్డారు . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పాదయాత్రకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తన పాయాత్రను ఎందుకు అడ్డుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు . తనంటే ప్రభుత్వం భయపడుతోందని అందుకే తనకు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తుందని ధ్వజమెత్తారు . తన పాదయాత్రను ఆపేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. తన పాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ కూడా ఉందని… అయినప్పటికీ కేసీఆర్ న్యాయస్థానాన్ని కూడా అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. తాను పాదయాత్ర చేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అంటే భయం లేకపోతే పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. ఇప్పటికే 85కు పైగా నియోజకవర్గాలను దాటొచ్చామని… ఇప్పుడు తమకు అడుగడుగునా ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆపడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగునా? అని ప్రశ్నించారు.

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని ఇచ్చారు. షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు అక్కడకు పెద్ద సంఖ్యలో వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

 

Related posts

పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింస.. నిలిచిపోయిన రైలు సర్వీసులు!

Drukpadam

షర్మిల స్పీచ్ స్క్రిప్ట్ కేసీఆర్ రాసి ఇచ్చిందా …?

Drukpadam

వెళ్తామంటే.. ఎవ్వరినీ ఆపబోం: బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Drukpadam

Leave a Comment