Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీ కమిటీకి కొండా సురేఖ షాక్ …

కాంగ్రెస్ పార్టీ కమిటీకి కొండా సురేఖ షాక్ …
-నిన్న ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం
– రాజీనామా చేసిన కొండా సురేఖ
-నిన్న పీసీసీ కమిటీలు ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
-కొండా సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం
-పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించనందుకు సురేఖ అలక
-తనకంటే జూనియర్లకు పీఏసీలో స్థానం కల్పించారని అసంతృప్తి

ఎట్టకేలకు భారీ స్థాయిలో జంబో కార్యవర్గాన్ని ప్రకటించిన కాంగ్రెస్ లో నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి.అనేక మంది అలకబూనారు . ప్రధానంగా సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత మాజీ మంత్రి కొండా సురేఖ తనకు కేవలం పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాత్రమే స్థానం కల్పించడంపట్ల తీవ్ర అసహనానికి లోనయ్యారు . తనకంటే జూనియర్లకు , పార్టీలోకి కొత్తగా వచ్చినవారిని అందలం ఎక్కించి తమను విస్మరించడంపట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కొండా ఫ్యామిలీ ఏ విధంగా అండగా ఉన్నదన్న విషయం పక్కన పెట్టి, అవమానకరంగా తమకన్నా జూనియర్లను అందలం ఎక్కించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు .

తెలంగాణ పీసీసీకి సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం నిన్న పలు కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి కొండా సురేఖకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారు. అయితే, పొలిటికల్ అఫైర్స్ కమిటీకి తనను ఎంపిక చేయకపోవడం పట్ల కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

తన కంటే జూనియర్లకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారని ఆమె ఆరోపించారు. ఇది తనను తీవ్రంగా అవమానించడమేనని పేర్కొన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశానని, తన భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా చేశారని, తమ కుటుంబానికి రాష్ట్రంలో ఎంతో పేరుందని అన్నారు.

కానీ, తనను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేయడం బాధించిందని కొండా సురేఖ వాపోయారు. ఎమ్మెల్యేలుగా కూడా గెలవని వారు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారని, తనను కూడా వారితో పాటే పరిగణించడం అసంతృప్తి కలిగించిందని అన్నారు. తన సీనియారిటీని తగ్గించి ఆ కమిటీలో వేశారని, అందుకే పీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వివరించారు.

Related posts

కేంద్రం వద్ద మేం అడుక్కుంటున్నామా?… మరి కేసీఆర్ ఏం బిచ్చమెత్తుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు?: ఏపీ మంత్రి పేర్ని నాని!

Drukpadam

అసెంబ్లీ తీర్మానాలు చెల్లవని హైకోర్టు చెప్పడం దారుణం: మోదుగుల

Drukpadam

బీజేపీ చేసిన పని రాహుల్ కి మేలు చేస్తుంది: శశిథరూర్

Drukpadam

Leave a Comment