Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం గులాబీ మాయం …బీఆర్ యస్ సభకు సర్వం సిద్ధం …

ఖమ్మం గులాబీ మాయంబీఆర్ యస్ సభకు సర్వం సిద్ధం
ప్లైక్సీలు , హోర్డింగ్ లతో నిండిపోయిన ఖమ్మం
ఖమ్మం నుంచి వైరా వెళ్లే రోడ్ వెలుగు జిలుగులు
కలెక్టరేట్ ప్రారంభానికి కేసీఆర్ తోపాటు రానున్న అతిరధ మహారధులు
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
పక్కనే భారీ బహిరంగ సభలక్షలాదిగా జనసమీకరణ
సభలో ప్రసంగించనున్న కేసీఆర్ , పినారై విజయన్ , కేజ్రీవాల్ , డి
రాజా .అఖిలేష్ , తమ్మినేని ,కూనంనేని

 

ఖమ్మం చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో జరుగునున్న బీఆర్ యస్ మొదటి సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేశారు . దీంతో ఖమ్మం గులాబీ మాయం అంయింది .

వెలుగు జిలుగులతో ఖమ్మం నూతన కలెక్టరేట్ సముదాయం

నూతన కలెక్టరేట్ సముదాయంతోపాటు , కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా సీఎం లు జాతీయ నేతల చేతులమీదుగా ప్రారంభించే ఏర్పాట్లు చేశారు . మొత్తం సభ ఏర్పాట్లను గత వారం రోజులకు పైగా మకాం వేసిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు పర్వవేక్షించారు . దగ్గరుండి అన్ని పనులను ప్రణాళిక బద్దగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూశారు . బహిరంగ సభాస్థలం దగ్గర డయాస్ , పార్కింగ్ స్థలాలు వలంటీర్ల ఏర్పాటు , వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ అధికారులతో చర్చించారు .

 

ఖమ్మం లో ఎక్కడ చూసిన బీఆర్ యస్ జెండాలు ప్లేక్సీలు , హోర్డింగ్ లతో హోరెత్తుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఖమ్మం నగరం గులాబీ రంగులతో గుబాళిస్తుంది. జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్న జిల్లాల నుంచి ప్రజలు అద్భుత సభను చూసేందుకు తరలి వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. . సభ స్థలి వైపు వెళ్లే వైరా రోడ్ మొత్తం మూసివేశారు . సభకు వచ్చే వాహనాలు మినహా ఇక్కడికి మరో వాహనాలు వచ్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు .

బహిరంగ సభ ప్రాంగణం

నూతన కలెక్టరేట్ సముదాయం పక్కనే రెండు హెలిపాడ్ లను ఏర్పాటు చేశారు . హైద్రాబాద్ , విజయవాడ లనుంచి రెండు హెలికాఫ్టర్లు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు సభ ఉంటుంది. సభలో కేసీఆర్ తోపాటు పినరై విజయన్, అరవింద్, కేజ్రీవాల్ భగవత్ సింగ్ మాన్ , సీపీఐ జాతీయ కార్యదర్శి జి.రాజా, సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం,కూనంనేని సాంబశివరావులు సభలో ప్రసంగించనున్నారు. సభ ముగియగానే నాయకులు వెళ్లి పోతారు . సిపిఎం , సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే అయినందున వారు రేపు నేరుగా సభాస్థలికి రానున్నట్లు సమాచారం .

 

సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది . వచ్చే గెస్టులతో దీన్ని ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేశారు . లక్షలాదిగా తరలి ప్రజలు వస్తారని అంచనాలు ఉండటంతో ఖమ్మం సభపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొన్నది .ఈసభ ద్వారా కేసీఆర్ దేశ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వనున్నారనే ఉత్సుకత కనబడుతుంది.

 

Related posts

సాగర్ లో కేసీఆర్ ,కేటీఆర్ ల ప్రచారం…

Drukpadam

ఉచిత విద్యుత్‌పై వ్యాఖ్యల వివాదం.. రేవంత్ రెడ్డి ట్వీట్!

Drukpadam

ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీదే అధికారం: అచ్చెన్నాయుడు!

Drukpadam

Leave a Comment