Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాశ్మీర్ లో జోడో యాత్ర ముగింపు సభ… నితీష్ దూరం !

సారీ.. రాలేకపోతున్నాం…కాంగ్రెస్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన జేడీయూ!

  • ఈ నెల 30న ముగియనున్న భారత్ జోడో యాత్ర
  • ముగింపు సభకు 24 పార్టీలకు ఆహ్వానం
  • ఇతర కార్యక్రమం వల్ల ముగింపు సభకు రాలేమన్న జేడీయూ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన ముగియబోతోంది. యాత్ర ముగింపు సభ జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరగనుంది. ముగింపు సభకు భావసారూప్యత కలిగిన 24 రాజకీయ పార్టీలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. జోడో యాత్ర ముగింపు సభకు రావాలని కోరుతూ లేఖలు రాశారు. 

అయితే ఈ ఆహ్వానాన్ని నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ తిరస్కరించింది. అదే రోజున తమ పార్టీకి అత్యంత ముఖ్యమైన కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని అదే రోజున ప్రారంభిస్తున్నామని… అందుకే ముగింపు సభలో పాల్గొనలేకపోతున్నామని చెప్పారు. ఈ మేరకు ఖర్గేకు లేఖను రాశారు.

Related posts

మళ్లీ రాజకీయాల్లోకి శశికళ… మద్దతుదారులతో చూచాయగా చెబుతున్న చిన్నమ్మ!

Drukpadam

చంద్రబాబు ఎలాంటి వ్యక్తో మోదీ, అమిత్ షాకు ఎప్పుడో తెలుసు: కొడాలి నాని తీవ్ర విమర్శలు!

Drukpadam

రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలి … దేశంలోని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారు :జైరామ్ రమేశ్!

Drukpadam

Leave a Comment