Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

ఆ సినిమా విషయంలో నాకు చెప్పిందొకటి .. చేసిందొకటి: భానుప్రియ!

ఆ సినిమా విషయంలో నాకు చెప్పిందొకటి .. చేసిందొకటి: భానుప్రియ!

  • చెన్నైలోనే ఉంటున్న భానుప్రియ 
  • తాజాగా ఇంటర్వ్యూలో ‘నాట్యం’ సినిమాను గురించి ప్రస్తావన 
  • ఆ సినిమాలో తన పాత్ర తనకి చెప్పినట్టుగా లేదని వ్యాఖ్య
  • షూటింగు సమయంలోనే తనకి అర్థమైపోయిందని వెల్లడి 
  • ఇకపై ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే చేస్తానని స్పష్టత   

అందం .. అభినయం .. నాట్యం కలగలిసిన రూపమే భానుప్రియ. తెలుగు తెరపై సంప్రదయ నృత్యానికి సంబంధించి ఆమెకి వచ్చినంత పేరు మరొకరికి రాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి భానుప్రియ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

“ఈ మధ్య ‘నాట్యం’ అనే ఒక సినిమా చేశాను. నా పాత్ర చాలా బాగుంటుందనీ .. కథలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని చెప్పారు. అంతలేదనే విషయం నాకు షూటింగు సమయంలోనే తెలిసింది. అప్పుడు మాట్లాడితే గొడవవలవుతాయని నేను ఏమీ మాట్లాడలేదు” అన్నారు. 

” ఈ సినిమా చూసిన తరువాత ‘ఎందుకు ఇలాంటి పాత్రలు చేస్తున్నారు? .. చేయకండి’ అంటూ నా అభిమానులంతా మెసేజ్ లు పెట్టారు. ఇక అప్పటి నుంచి నా పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అలాంటి పాత్రలు వస్తే చేయడానికి నేను రెడీగానే ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు. 

Related posts

హీరో ఎవరైనా అంతిమంగా సినిమా గెలవాలి … పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్!

Drukpadam

తిరుపతిలో విలేకరుల సమావేశంలో గొడవపై దర్శకురాలు నందినిరెడ్డి క్లారిటీ!

Drukpadam

నేను, చిరంజీవి కలిసి సినిమా చేస్తే అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది: బాలకృష్ణ​​​​​​​!

Drukpadam

Leave a Comment