క్రైమ్ వార్తలు

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 11 మంది మృత్యువాత

11 dead in two firing incidents in america
కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 11 మంది మృత్యువాత
  • అమెరికాలో మరోమారు గర్జించిన గన్
  • పుట్టిన రోజు వేడుకలపై కాల్పుల్లో ఏడుగురు మృతి
  • ఉడ్‌ల్యాండ్‌లో పొరిగింటి వారిపై కాల్పుల్లో ముగ్గురు మృత్యువాత
అమెరికాలో గన్ మరోమారు గర్జించింది. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మందిని పొట్టనపెట్టుకుంది. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్క్‌లో ఓ కుటుంబం పుట్టిన రోజు వేడుకులు జరుపుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు విడిచారు. వేడుకలు జరుపుకుంటున్న కుటుంబంలోని మహిళకు నిందితుడు స్నేహితుడేనని పోలీసులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

ఉడ్‌ల్యాండ్‌లో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నిందితుడు తన పొరుగు ఇంటిలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితుడు ఆ ఇంటికి నిప్పు పెట్టాడు.  ఎదురు కాల్పుల్లో అతడు హతమైనట్టు పోలీసులు తెలిపారు.

Related posts

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: అస్వస్థతకు గురైన అగ్నిమాపక సిబ్బంది!

Drukpadam

ఒకే చీర కోసం షాపింగ్ మాల్‌లో ఇద్దరు మహిళల మధ్య పోట్లాట..!

Drukpadam

సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో రక్తసిక్తం

Drukpadam