Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి ఎన్నికలకు తేదీ ఖరారు చేసిన సీడబ్ల్యూసీ…

కాంగ్రెస్​ అధ్యక్ష పదవి ఎన్నికలకు తేదీ ఖరారు చేసిన సీడబ్ల్యూసీ…
జూన్ 23న నిర్వహించాలని నిర్ణయం
2019 నుంచి ఖాళీగా ఉన్న స్థానం
ఎన్నికల్లో ఘోర వైఫల్యంతో తప్పుకొన్న రాహుల్
తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా
వరస అపజయాలతో ఇంట బయట అబాసు పాలుఅవుఅవుతున్న కాంగ్రెస్ కు చికిత్స అవసరం అనే నిర్ణయానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చినట్లు ఉన్నారు. ఆమె వయసు ఆరోగ్యం కూడా సహకరించటంలేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీని పునర్వ్యవస్తీకరణ చేయకపోతే మరిన్ని ఇబ్బందులు తప్పవనే అంచనాకు వచ్చినట్లు ఉన్నారు. వెంటనే ఎన్నికలు జరిపి అధ్యక్షుడిని ఎన్నిక చేయాలనీ నిర్ణయించారు. లోకసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ పదవినుంచి తప్పుకున్నారు. తరువాత ఆయన్ను తిరిగి భాద్యతలు చేపట్టాల్సిందిగా అనేక సార్లు వత్తిడి తెచ్చిన ఆయన అందుకు ససేమీరా అన్నారు. అప్పటి నుంచి అధ్యక్ష పీఠంపై ఖాళీగానే ఉంటుంది.తరువాత కొంత కాలానికి సోనియా కాంగ్రెస్ కు తాత్కాలిక అధ్యక్షురాలుగా వ్యవహరించేందుకు అంగీకరించారు. అయితే కరోనా నేపథ్యంలో ఆమె చాలాకాలంగా తాత్కాలికంగానే వ్యవహరించటం , తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాల పలు అవడంతో విమర్శలు వచ్చాయి . ఇటీవల జరిగిన ఎన్నికలకు ఆయా రాష్ట్రాల నాయకులు సమాధానం చెప్పాలని అందుకు నివేదికలు ఇవ్వాలని సోనియా గాంధీ కోరారు . ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. జూన్ 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. ఎన్నిక ద్వారానే పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్ ను పార్టీ నేతలు పలుమార్లు బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.

అప్పట్నుంచి ఆమే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే, రెండేళ్ల ఈ సందిగ్ధానికి ఇప్పుడైనా తెరపడుతుందా? అని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఫిబ్రవరిలోనే జరగాల్సిన పార్టీ అధ్యక్ష ఎన్నికలను.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీడబ్ల్యూసీ వాయిదా వేసింది.

Related posts

జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు: ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్..!

Drukpadam

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలి …కేజ్రీవాల్

Drukpadam

రేవంత్ రెడ్డి గృహనిర్బంధం …ఇంటికి వచ్చే అన్నిదార్లు క్లోజ్!

Drukpadam

Leave a Comment