రాజకీయ వార్తలు

రేపటి నుంచి తెలంగాణలో ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమం!

రేపటి నుంచి తెలంగాణలో ‘ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమం!
-ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ భవన్ లో కార్యక్రమం
-ప్రారంభించనున్న చంద్రబాబు
-తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్రలు
-టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ

తెలంగాణాలో టీడీపీ పార్టీని బతికించాలనే ఆలోచనతో ఉన్న చంద్రబాబునాయుడు అందుకు అనుగుణంగా ఇటీవల కాలంలో కేంద్రీకరించారు .అందులో భాగంగానే కొద్దీ రోజుల క్రితం ఖమ్మం లో బహిరంగ సభ పెట్టారు .ఆసభకు టీడీపీ అభిమానులు బాగానే తరలి వచ్చారు .తర్వాత నిజామాబాద్ లో సభ పెడతామన్నారు .కానీ ఇంకా పెట్టలేదు …ఎన్నికల నాటికీ మరికొన్ని చోట్ల సభలు పెట్టడంతో పాటు రాష్ట్రంలో బస్సు యాత్రల ద్వారా ఇంటింటికి పార్టీ సందేశాన్ని తీసుకోని పోవాలని నిర్ణయించుకున్నారు .

తెలంగాణలో రేపటి నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. రేపు (ఫిబ్రవరి 26) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఇంటింటీకీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారని జ్ఞానేశ్వర్ చెప్పారు.

10 రోజుల తర్వాత అన్ని గ్రామాల్లో బస్సు యాత్రలు చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని వివరిస్తామని వెల్లడించారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో సభ జరుపుతామని కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు. ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారని తెలిపారు.

Related posts

భారతీయుల డీ ఎన్ ఏ ఒక్కటే: మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!

Drukpadam

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి శరద్ పవర్ నో ….

Drukpadam

బజరంగ్‌ దళ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు…

Drukpadam