Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ లో అలజడికి కారణమైన అధికారులతో తుమ్మల సమీక్ష !

బీఆర్ యస్ లో అలజడికి కారణమైన అధికారులతో తుమ్మల సమీక్ష !
-వివాదాస్పదంగా మారిన సీతారామ ప్రాజక్టు పై మాజీమంత్రి తుమ్మల రివ్యూ …
-ఆదివారం అధికారులను తన ఇంటికి పిలిపించుకొని సమీక్ష
-జిల్లా మంత్రి ఉండగాతుమ్మల రివ్యూ చేయడంపై విమర్శలు
-పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సమీక్షలంటున్న తుమ్మల అనుయాయులు
-బీఆర్ యస్ లో కొత్త తగాదా …

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం దమ్మపేట మండలంలోని గండుగులపల్లి లోని తన నివాస గృహంలో అధికారులతో జరిపిన సమీక్షబీఆర్ యస్ లో అలజడికి కారణమైంది . కొత్త తగాదాకు దారితీసింది … తుమ్మల పార్టీలో సీనియర్ నేత …నీటి ప్రాజక్టుల విషయంలో ఆపార అనుభవముంది . ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చాలాకాలం భారీనీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు . జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతారామ ప్రాజక్టు పై ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి సమీక్ష నిర్వహించడం వివాదంగా మారింది. ఆయన సమీక్ష సీఎం ఆదేశాల మేరకు జరిగిందా ? లేక ఆయన సొంతంగా చేశారా ? అనే సందేహాలు ఉన్నాయి. సాధారణంగా జిల్లా మంత్రి దీనిపై అధికారులతో సమీక్ష జరుపుతారు . జిల్లాకు చెందిన మంత్రి అజయ్ కుమార్ గతంలో అనేక సార్లు సమీక్ష జరిపారు. మంత్రి జిల్లాలో ఉండగానే మాజీమంత్రి పిలిస్తే అధికారులు వెళ్లడం అక్కడ ఆయనకు ప్రాజక్టు గురించి వివరించడం జరిగింది. అంటే కాకుండా ఆయన ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడటం , రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడటంపై బీఆర్ యస్ లో కొత్త తగాదా కు దారితీసిందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పార్టీ లేదా అధికారులు వివరణ ఇవ్వాల్సిఉంది. ఒకవేళ తుమ్మలకు ప్రత్యేక హోదాతో సీతారామ ప్రాజక్టు పనులపై సమీక్ష చేయమని అంటే ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు .ఆలా కాకుండా ఆయన అధికారాలను జిల్లా మంత్రికి తెలియకుండా చేస్తే మాత్రం కొత్త చర్చకు దారితీస్తుంది.

Related posts

ఖమ్మం సంకల్ప సభలో కేసీఆర్ పై షర్మిల నిప్పులు

Drukpadam

ఏపీ లో నిర్బంధాల మధ్య రహస్య ప్రయాణం చేసిన తెలుగుదేశం నేతలు!

Drukpadam

నచ్చింది ధరించవచ్చు బట్ అన్ని చోట్ల కాదు …యోగి

Drukpadam

Leave a Comment