Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

హైద్రాబాద్ లో అనుమానిత వ్యక్తి చేతిలో బ్యాగు … భారీ పేలుడు!

హైద్రాబాద్ లో అనుమానిత వ్యక్తి చేతి బ్యాగు … భారీ పేలుడు!
-కుత్బుల్లాపూర్‌లో ఘటన … ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు
-కిలోమీటరు దూరం వినిపించిన పేలుడు శబ్దం
-అతడి దగ్గరున్న మరో బ్యాగులో చెత్త
-ఆ బ్యాగ్ బాలానగర్‌లో దొరికిందన్న నిందితుడు
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో పేలుడు ఘటన ఒక్కసారిగా భాగ్యనగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక అపరిచిత వ్యక్తి రెండు బ్యాగులు తీసుకొని పోతున్నాడు . జయరాం నగర్ చౌరస్తా వద్ద తన చేతిలో ఉన్న బ్యాగును ఒక్కసారిగా దూరంగా విసిరారు. అందులో నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఏమి జరిగిందని ప్రజలు అనుకొనే లోపునే పెద్ద మంటలు వ్యాపించాయి. జరిగిన సంఘటనకు భారీ పేలుడుతో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. రెండు బ్యాగులు మోసుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి జయరాంనగర్ చౌరస్తా వద్ద ఒకదానిని విసిరేశాడు. అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు వరకు వినిపించింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న పూజాసామగ్రి దుకాణం అద్దాలు బద్దలయ్యాయి. ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో వణికిపోయారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి చేతిలో ఉన్న మరో బ్యాగును తెరించేందుకు బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు. అనంతరం దానిని తెరిచి చూడగా చెత్త ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని విచారించగా తనుకు ఆ బ్యాగ్ బాలానగర్‌లో దొరికిందని చెప్పాడు. దానిని చూసి కుక్కలు మొరుగుతుండడంతో పడేసినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితున్ని అదుపులోకి తీసుకోనున్నారు . ఈ బ్యాగులు ఎక్కడివి అతని దగ్గరికి ఎందుకు వచ్చాయి. ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా? తనకు ఏమి తెలియదని అంటున్న అపరిచితుడికి నిజంగానే ఏమి తెలియదా ? అవి ఎలాంటి బ్యాగులు ఎక్కడ నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

అమ్మ దొంగలు …పోలిసుల ముందు కుప్పిగంతులా!

Drukpadam

దేశంలోకి నకిలీ కరెన్సీని భారీ ఎత్తున సరఫరా చేసే మొహమ్మద్ దర్జీ దారుణ హత్య!

Drukpadam

అమెరికాలో దారుణం ..బర్గర్ తింటున్న యువకున్ని దారుణంగా కాల్చి చంపిన పోలీస్ !

Drukpadam

Leave a Comment