Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ…

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ…

  • హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీరుపై తీవ్ర అసంతృప్తి
  • తాయెత్తు తన జబ్బు తగ్గించిందని ఇటీవల వ్యాఖ్య
  • పదవిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారని సీఎస్ కు లేఖ

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల మాట్లాడుతూ… వైద్యులు తగ్గించలేని జబ్బును తాయెత్తు తగ్గించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చిన్నప్పుడు తనకు తాయెత్తు కట్టడం ద్వారా జబ్బు తగ్గిందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. హెల్త్ డైరెక్టర్ గా ఉండి ఈ వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర దుమారం రేగింది.

దీనిపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా సీఎస్ కు లేఖ రాసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, గతంలో ఆయన కేసీఆర్ కాళ్లను తాకారు. అంతేకాదు, కేసీఆర్ తెలంగాణ జాతి పిత అంటూ కితాబునిచ్చారు.

Related posts

చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో మరో కేసులో పీటీ వారెంట్

Ram Narayana

విషమంగానే ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం..

Drukpadam

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే తిక్క సమాధానం తరిమికొట్టిన జనం …

Drukpadam

Leave a Comment