Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

270 మంది కొవిడ్ బాధితులను కాపాడిన వైద్యుడు!

270 మంది కొవిడ్ బాధితులను కాపాడిన వైద్యుడు!
-మహారాష్ట్రలోని జలగావ్‌లో ఘటన
-సకాలంలో ఆసుపత్రికి చేరని ఆక్సిజన్ ట్యాంకర్
-100 సిలిండర్లతో రోగుల ప్రాణాలు కాపాడిన డాక్టర్ సందీప్
పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఓ వైద్యుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించి 270 మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాడు. మహారాష్ట్రలోని జలగావ్‌లోని ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ నెల 13న ఏడున్నర గంటల సమయంలో 20 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకు నిండికునేందుకు సమయం దగ్గరపడింది.

అప్పటికి ఆసుపత్రిలో దాదాపు 270 మంది రోగులు ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన డాక్టర్ సందీప్ బృందం ట్యాంకర్ నిండుకోవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు 100 ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి రోగుల ప్రాణాలను కాపాడింది. ఇందుకోసం వారు దాదాపు 8 గంటలుగా శ్రమించారు. నిజానికి ఆ రోజు సందీప్ బర్త్ డే. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నా విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన సందీప్ వందలాదిమంది ప్రాణాలను కాపాడాడు. దీంతో సందీప్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

తన 8 మంది పిల్లలను పోషిస్తామన్న అధికారుల హామీతో టీకా వేయించుకున్న వ్యక్తి!

Drukpadam

కరోనా దెబ్బకి చైనాలో అతిపెద్ద షాపింగ్ మహల్ మూసివేత …

Drukpadam

బెంబెలెత్తిస్తున్న కరోనా కేసులు… రేపటి నుంచి బెంగాల్ లో విద్యాసంస్థల మూసివేత!

Drukpadam

Leave a Comment