నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత
కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
అత్యత భక్తి ప్రపత్తులు కలిగిన కేసీఆర్ యాగాలు యజ్ఞాలు తరుచు చేస్తుంటారు … ఎర్రవెల్లి నివాసంలో వేద పండితులతో నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సాంప్రదాయ వస్త్రాలతో భార్యతో కలిసి దర్శనమిచ్చారు …యాగం వద్ద కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు … తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసినన్ని యాగాలు ,యజ్ఞాలు మరెవరు చేసి వుండరు …గతంలో తన వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లిలో పెద్ద ఎత్తున యాగం చేశారు …అప్పుడు ఆయాగం చేసేందుకు రాష్ట్రమే కదలి వచ్చింది …ఇప్పుడు తిరిగి ఎర్రవల్లిలోనే కేసీఆర్ యాగం చేస్తున్నారు ..అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అధిక రోజులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు ..బీఆర్ యస్ నేతలతో అక్కడ సమావేశాలు , సమీక్షలు ,చేస్తున్నారు …ఆయన కోసం నేతలు అక్కడ క్యూకట్టడం సర్వసాధారణంగా మారింది …
Save or share this story as a newspaper-style Epaper Clip: