మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హుజూర్ నగర్ (మం) మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్ వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసరగా కోదాడలో ల్యాండింగ్ అయింది. కమ్ముకున్న మబ్బులు, గాలివాన నేపధ్యంలో వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు అప్రమత్తమైన పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. కాగా, మంత్రి కోదాడ నుంచి హుజూర్ నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లి పోయారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: