రాజకీయ వార్తలు

పొత్తుల్లో తేడా వస్తే …బలమున్న చోట లెఫ్ట్ పార్టీలు పోటీ …కూనంనేని

పొత్తుల్లో తేడా వస్తేబలమున్న చోట లెఫ్ట్ పార్టీలు పోటీకూనంనేని
తెలంగాణాలో బీఆర్ యస్ కు పోటీ కాంగ్రెస్సే
తెలంగాణాలో బీజేపీ సోదిలో కూడా ఉండదు
లేనిబలాన్ని ఉన్నట్లుగా చెప్పడం బీజేపీ నైపుణ్యం
బీఆర్ యస్ తోనే ఎన్నికల్లో మా ప్రయాణం
బీఆర్ యస్ తో ఇంకా చర్చలు జరగలేదు
వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తాముఅందుకోసం ఎదురు చూస్తున్నాం

బీజేపీ ఓటమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. అందుకోసం దేశవ్యాపితంగా అందరిని ఐక్యం చేశేపనిని లెఫ్ట్ పార్టీలు తీసుకున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు . శనివారం రోజున ఖమ్మం వచ్చిన ఆయన్ను కొందరు విలేకర్లు కలవగా వారితో చిట్ చాట్ గా మాట్లాడుతూ తమ రాజకీయ వైఖరిని వివరించారు . తెలంగాణాలో
జరిగే ఎన్నికల్లో మేము కచ్చితంగా పోటీచేస్తాం ఒక వేళ పొత్తుల్లో తేడావస్తే బలమున్న చోట పోటీచేస్తాం అని సాంబశివరావు కుండబద్దలు కొట్టారు . కాంగ్రెస్ తో కలుస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మేము నిర్ణయం తీసుకున్న చర్చల అనంతరమేనని అన్నారు . అదికూడా పార్టీలో చర్చజరిపి ,సీపీఎంతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగిస్తాంఅందువల్లనే బీఆర్ యస్ తో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాంవారితో చర్చలు జరపేందుకుప్రతిపాదనలు పెట్టాం అందుకు వారు అంగీకరించారు. అయితే ఎప్పడు మాట్లాడతారనేది చెప్పలేమువారి పిలుపుకోసం ఎదురు చూస్తున్నాం . వాళ్ళు లెఫ్ట్ పార్టీలకు ఎమ్మెల్యేలు , ఎంపీలు ఇచ్చి సరిపుచ్చాలని చూస్తన్నట్లు వార్తలు వస్తున్నాయి. మామధ్య ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదు . చర్చలు జరగకుండా వారి వైఖరి తెలియకుండా మాట్లాడటం మంచిది కాదన్నారు . తెలంగాణ లో బీజేపీలో బలబడేందుకు కాంగ్రెస్సే కారణమని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. హుజారాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి పోటీలో ఉండగా బీజేపీ అభ్యర్థి ఈటెలకు మద్దతు ఇచ్చి గెలిపించి కాంగ్రెస్ ఘోరమైన తప్పిదం చేసేందని అన్నారు . ఆపార్టీ అభ్యర్థికి 3 వేల ఓట్లు రావడమేమిటని ప్రశ్నించారు . ఇక్కడ బీజేపీ అధికారం ఉహించుకుంటుందని అది సోదిలో కూడా ఉండదనే విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు . ఇప్పటికే ఆపార్టీలో చేరిన కొందరు పొరపాటు చేశామని అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని తెలంగాణ లోబీజేపీకి స్తానం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ యస్ కాంగ్రెస్ కు మద్యన పోటి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Related posts

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన జ‌గ్గారెడ్డి!

Drukpadam

ఆర్‌ఎల్‌డీ జాతీయ అధ్యక్షుడిగా అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి…

Drukpadam

చినజీయర్  దిష్టి బొమ్మలను తగులబెట్టాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు!

Drukpadam