Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ యస్ ఎమ్మెల్యేల్లో ఉండేదెవరో ఊడేదెవరో …అంత రహస్యమే..!

బీఆర్ యస్ ఎమ్మెల్యేల్లో ఉండేదెవరో ఊడేదెవరోఅంత రహస్యమే..!
తిరిగి టికెట్స్ పై ఎమ్మెల్యేల్లో టెన్షన్ ,టెన్షన్
ఇప్పటికే 30 నుంచి 40 మందికి కొత్తవారికి అవకాశం ఇస్తారనే సంకేతాలు
పనితీరు ఆధారంగానే టికెట్స్ అన్న కేసీఆర్
దళితబందు లో ఎమ్మెల్యేలపై అవినీతి మరకలు
సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
ఎమ్మెల్యేలు తీసుకొన్న డబ్బులు తిరిగి ఇస్తున్నట్లు వార్తలు
కమ్యూనిస్టులతో పొత్తుపైరాని క్లారిటీహుస్నాబాద్ లో బీఆర్ యస్ ,సిపిఐ అభర్ధుల ప్రకటన ..

తెలంగాణ రాష్ట్రం అసలే అధిక ఉష్టోగ్రతలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే దీనికి తోడు రాజకీయ వాతారణం మరింత వేడెక్కిస్తుంది. . మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల కోసం అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. బీఆర్ యస్ లో ఎంతమందికి తిరిగి సీట్లు ఇస్తారుఉండేదెవరో ,ఊడేదెవరో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు . కొన్ని చోట్ల అధికార బీఆర్ యస్ తోపాటు సిపిఐ అభ్యర్థులను ప్రకటించింది. అధికార బీఆర్ యస్ లో ఉన్న 104 మంది ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 మందివరకు కొత్తవారికి టికెట్స్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. 60 నుంచి 70 మంది అభ్యర్థులు పాతవారే పోటీచేస్తారు . ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొద్దినెలల క్రితమే వెల్లడించారు . అయితే ఆయన 25 నుంచి 30 మంది అభ్యర్థులు మారతారని అన్నారు . అంటే మార్పు మాత్రం ఖాయం, సంఖ్య పెరిగే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు రాజకీయ పండితులు

ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే టికెట్స్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ,అవినీతి మరకలు ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలనే యోచలో అధినేత కేసీఆర్ ఉన్నారని తెలుస్తుంది. ప్రత్యేకించి దళితబంధు అమల్లో కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వారికీ టికెట్స్ ఇవ్వడం పై సందేహాలు నెలకొన్నాయని అంటున్నారు . అయితే కొందరు ఎమ్మెల్యేలు ఆపేరుతో తీసుకున్న డబ్బులను తిరిగి లబ్దిదారులకు అందజేస్తున్నారని సమాచారందీంతో సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన వార్నింగ్ గట్టిగానే పనిచేసినట్లు చెప్పుకుంటున్నారు .

ఎమ్మెల్యేలు పనితీరులో మార్పు రావాలని , నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు . ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. కొన్ని చోట్ల ప్రజల నుంచి స్పందన రాగ , మరికొన్ని చోట్ల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. దీనిపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్న కేసీఆర్ టికెట్స్ ఇచ్చే విషయంలో తన మనసులోని మాటలను బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉంటున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఎన్నికల నాటికీ ఎంతమందికి టికెట్స్ ఇస్తారు …? ఎంతమందిని డ్రాప్ చేస్తారనే అయోమయం ఎమ్మెల్యేల్లో నెలకొన్నది .దీంతో వారు టెన్షన్ పడుతున్నారు. ఎమ్మెల్యే సీటు వస్తుందని నమ్మకంతో అప్పులు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిత్యం ప్రజల్లో ఉంటె చివరికి టికెట్ లేదంటే తమ పరిస్థితి ఏమి కావాలని ఆందోళన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో వ్యక్తం అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదుగాని 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను మారుస్తారని బాగా ప్రచారం జరుగుతుంది. ఇందులో కొందరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అంటున్నారు . ఒక పార్టీ టికెట్ పై గెలిచి వేరే పార్టీలోకి వెళ్లడంపై కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆజాబితాలో కొందరు ఉండగా ,అవినీతి మరకలు , పనితీరు ఆధారంగా మరికొందరిని పక్కన పెడతారని విశ్వసనీయ సమాచారం .

ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలు , చతురతతో ఎత్తులు వేస్తున్నారు . అందుకు అనుగుణంగా సర్వే రిపోర్టులు , ఇంటలిజెన్స్ నివేదికలు , జిల్లా నేతల అభిప్రాయాలను సేకరించే పనిలో ఉన్నారు . ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులను అంచన వేస్తున్నారు . ఎంత గొప్పవాడైన గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. అయితే కమ్యూనిస్టులతో పొత్తు ఉండాలా…? వద్దా …? ఉంటె ప్రయోజనం ఏమిటి …? లేకుంటే జరిగే నష్టం ఉంటుందా అనేదానిపై ఆరా తీస్తున్నారు. కమ్యూనిస్టులల్తో పొత్తు వల్ల ఉపయోగం లేదనుకుంటే వారిని కూడా పక్కనపెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు బీఆర్ యస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు సిన్సియర్ గా బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్ యస్ తో జతకట్టాలని కోరికతో ఉన్నాయి. అందుకోసం తాము పోటీచేసే సీట్లపై క్లారిటీ కోసం అధినేత కేసీఆర్ తో నేరుగా చర్చించేందుకు సమయం కావాలని కోరినప్పటికీ అటు వైపు నుంచి సమాధానం రాకపోవడంపై కామ్రేడ్స్ అసహనంతో ఉన్నారు .పైగా తాము కోరుతున్న సీట్లలో అభ్యర్థులను సైతం బీఆర్ యస్ ప్రకటించడంపై గుర్రుగా ఉన్నారు . హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సిపిఐ కోరుతుంది. అక్కడ నుంచి సిపిఐ సీనియర్ నేత పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ని తమ అభ్యర్థిగా పోటీకి దించాలని పార్టీలో నిర్ణయం జరిగింది. అయితే అక్కడ బీఆర్ యస్ తన అభ్యర్థిని ప్రకటించడం పై సిపిఐ శ్రేణులు మండిపడుతున్నాయి . ఇటీవల అక్కడ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ బీఆర్ యస్ సిట్టింగ్ అభ్యర్థి వడితేల సతీష్ కుమార్ తిరిగి హుస్నాబాద్ నుంచి పోటీచేస్తారని ప్రకటించారు . దీంతో సిపిఐ కూడా అక్కడ బహిరంగ సభ పెట్టి తమ అభ్యర్థిగా చాడ వెంకట రెడ్డి ని ప్రకటించింది. దీంతో బీఆర్ యస్ లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తులపై నీలి నీడలు అలుముకున్నాయి. అటు కేసీఆర్ లెఫ్ట్ పార్టీలు తనను కలిసి చేర్చించేందుకు సమయం ఇవ్వక పొగ మరోపక్క తాము పోటీచేయాలనుకున్న చోట అభ్యర్థులను ప్రకటిచడంపై సందేహాలు నెలకొన్నాయి. బీఆర్ యస్ తో పొత్తు లేకపోతె తమకు బలమున్న చోట పోటీలో ఉంటామని సిపిఐ రాష్ట్ర కార్త్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించడం గమనార్హం

బీఆర్ యస్ లో ఒక పక్క సీటింగ్ లకు సీట్ల టెన్షన్ , మరో పక్క పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడంపై అయోమయం , అంతకుముందు ఉన్నవారిని ఎలా అకామిడేట్ చెయ్యాలనే తర్జన భర్జనలతో అధినేత కేసీఆర్ తన ఆలోచనలకు పదును పెడుతున్నారు ….చూద్దాం ఏమిజరుగుతుందో …!

Related posts

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…!

Drukpadam

ష‌ర్మిల బృందంపై చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు!

Drukpadam

క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం జగన్!

Drukpadam

Leave a Comment