పార్లమెంట్ సీట్ల పంపుదలపై హింట్ ఇచ్చిన ప్రధాని మోడీ…
-నూతన పార్లమెంట్ భవనం ప్రారంభ సందర్భంగా ప్రధాని ప్రసంగం
-త్వరలో ఎంపీ సీట్లు పెరుగుతాయని స్వయంగా చెప్పిన మోదీ!
-రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందన్న ప్రధాని
-అందుకు తగ్గట్లుగానే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని వెల్లడి
-పాత పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికే ఇబ్బంది ఉండేదని వ్యాఖ్య
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ సీట్లపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుందని అన్నారు. అందుకు తగ్గట్లుగానే ఆధునిక వసతులతో కొత్త భవానాన్ని నిర్మించామని తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్ ను 1,272 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మించామని వెల్లడించారు.
పాత పార్లమెంట్ భవనంలో కూర్చోవడానికే కాకుండా సాంకేతికంగానూ ఇబ్బంది ఉండేదని మోదీ చెప్పారు. ‘‘పాత పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు సాగించడం ఎంత కష్టంగా ఉండేదో మీకు తెలుసు. కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అందుకే కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది’’ అని వివరించారు.
‘‘ఇంకో విషయం ఏంటంటే.. భవిష్యత్ లో సీట్ల సంఖ్య పెరుగుతుంది. సభ్యులు పెరుగుతారు. మరి వాళ్లంతా ఎక్కడ కూర్చుంటారు?అందుకే.. ఇదే సమయమని భావించి కొత్త బిల్డింగ్ నిర్మించాం’’ అని వివరించారు.
పార్లమెంట్ సీట్ల పంపు ఎప్పుడో జరగాల్సి ఉంది మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే జనాభాలో చైనాతో పోటీ పడుతున్నాం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్న వివిధ ప్రాంతాల ,భాషల సమూహం మనది . భాష ప్రాతిపదికన రాష్ట్ర విభజన జరిగినప్పటికీ తిరిగి రాష్ట్రాలు ఒకే భాషతో ఉంది రెండు రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు అవతరించాయి. అదే విధంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువగానే ఉన్నాయి. పార్లమెంట్ సీట్ల విభజన సందర్భంగా కూడా సీట్ల సంఖ్య పెంచకుండా విభజన జరపడంతో ప్రాంతాలు మారాయిగాని సీట్లు పెరగలేదు . పైగా తెలుగు రాష్ట్రాలు విభజించిన సందర్భంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచుతామని చెప్పిన కేంద్రం అన్నమాట నిలబెట్టుకోలేదు . అదే మంటే 2026 డీలిమిటేషన్ సందర్భంగా పెరుగుదల ఉంటుందని అంటున్నారు . కొత్త లోకసభ లో సభ్యుల సంఖ్య పెరుగుతుందని ముందుచూపుతో పెరిగే సభ్యులకు అనుగుణంగా సీటింగ్ పెంచుతున్నట్లు ప్రధాని చెప్పారు . ఇప్పటికే కొన్ని లోకసభ స్థానాల్లో అధికంగా మరికొన్ని స్థానాల్లో స్వల్పంగా ఓటర్లు ఉన్నారు. ఈసారి డీలిమిటేషన్ సందర్భంగా ఓట్లర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది …