Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

ఏపీపై  బీజేపీ ఫోకస్ …అమిత్ షా,జేపీ నడ్డా రాక

ఏపీపై  బీజేపీ ఫోకస్ …రెండు రోజుల వ్యవధిలో అమిత్ షా,జేపీ నడ్డా రాక
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు

అప్పుడే ప్రారంభమైన ఎన్నికల సందడి

ఈ నెల 8న అమిత్ షా, 10న జేపీ నడ్డా రాక

వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయింది. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు. రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు.

ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమౌతోంది …మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా లు రెండు రోజుల వ్యవధిలో రానున్నారు . ఏపీ లో వచ్చే మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ,జనసేన కలిసి ఎన్నికలు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే జనసేన మాత్రం బీజేపీతో పటు టీడీపీ కలిసి వెళితేనే అధికారంలో ఉన్న వైసిపిని ఎదుర్కోగలమని భావిస్తుంది.దాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ద్వదంగా తోసిపుచ్చుతుంది. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని కుండబద్దలు కొడుతోంది. పవన్ కళ్యాణ్ మాత్రం అవసరమైతే బీజేపీతో తెగదెంపులు చేసుకొని టీడీపీ తో వెళ్లాలని చేసుతుంది. దీంతో వారి పర్యటనకు ప్రాధ్యానత ఏర్పడింది.

ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా… బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు. ఇంకోవైపు జనసేనతో పొత్తు కొనసాగుతోందని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జననేన అధినేత పవన్ చెపుతున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై బీజేపీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Related posts

భారత్ సమీపంలోని మూడు దీవులను చైనాకు అప్పగించేసిన శ్రీలంక!

Drukpadam

అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

Ram Narayana

మాజీ ఎంపీ పొంగులేటి చుట్టూ రాజకీయం?

Drukpadam

Leave a Comment