Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారా …?

వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీ తమిళనాడు నుంచి పోటీ చేయబోతున్నారా …?
-వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ
-గత పర్యాయం వారణాసి నుంచి పోటీ చేసి యూపీలో హవా చాటిన మోదీ
-దక్షిణాది టార్గెట్ గా బీజేపీ పావులు
-ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మధురై నుంచి పోటీ చేస్తారని ప్రచారం
-ఉత్తరాదిలో తగ్గే సీట్లను ఇక్కడ సరిచేయాలని లెక్కతో పక్కాగా ప్లాన్

కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ టార్గెట్‌ గా పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటి నుంచే అందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. గత రెండు పర్యాయాలు ఉత్తరాదిలో హవాతో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే పదేళ్ల పాలనలో సహజంగానే పెరిగే వ్యతిరేకతతో ఈసారి అక్కడ కొన్ని ఎంపీ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఉత్తరాదిలో కోల్పోయే ఆ స్థానాలను దక్షిణాదిలో రాబట్టుకోవాలని ఆశిస్తోంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ఈసారి తన క్షేత్ర స్థానంగా ఎంచుకుంటారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఉత్తరాది పెత్తనం పెరిగిపోతుందని దక్షణాది రాష్ట్రాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని తమిళనాడును ఎంచుకోవడం ,అందులో హిందీకి వ్యతిరేక రాష్ట్రమైన తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన వ్యక్తిగత ఇమేజ్  కొంచెం దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో మోదీ ఆ రాష్ట్రం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఆయన వారణాసి నుంచి పోటీ చేసినప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం తన మ్యాజిక్ చూపించారు. ఇప్పుడు అదే మ్యాజిక్ ను తమిళనాడులో రిపీట్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలకు సింగోల్‌ను తీసుకొచ్చి అమర్చడం వెనుక ఇదే అతిపెద్ద కారణమని భావిస్తున్నారు. ఇప్పటివరకు తమిళనాడు నుంచి పోటీ చేసి ఏ ఒక్కరు కూడా ప్రధాని కాలేదు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ బ్రేక్ చేయాలని చూస్తున్నారు. చాలా నెలల క్రితమే దాని ప్రణాళికాబద్ధమైన వ్యూహం రూపొందించారని సమాచారం. ఇక ఇప్పటిదాకా రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను మదురై లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని తెలుస్తోంది.

Related posts

కవిత-రేవంత్ రెడ్డి మధ్య చీకటి వ్యాపారాలు, జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…

Drukpadam

వడ్లు కొనుగోళ్లపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తాం …టీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామా!

Drukpadam

చంద్రబాబు వద్దని చెపితే.. మేము ఊరుకోవాలా?: ధర్మాన ప్రసాదరావు

Drukpadam

Leave a Comment