Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కరోనా ఎఫెక్ట్: వర్చువల్‌గానే టీడీపీ మహానాడు!

కరోనా ఎఫెక్ట్: వర్చువల్‌గానే టీడీపీ మహానాడు!
రేపటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న పార్టీ
గతేడాది రెండు రోజులపాటు వర్చువల్‌గా మహానాడు
ఈసారి ఒక్క రోజుకే పరిమితం చేయాలని యోచన?
కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో గతేడాది లానే ఈసారి కూడా వర్చువల్‌గానే మహానాడును నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 నుంచి మూడు రోజులపాటు మహానాడును టీడీపీ అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. కరోనా ఉద్ధృతంగా ఉండడంతో గతేడాది కూడా మహానాడును వర్చువల్‌గానే నిర్వహించి రెండు రోజుల్లో ముగించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు ఎక్కడున్నవారు అక్కడి నుంచే హాజరయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు ప్రసంగించారు.

కరోనా వైరస్ మరోమారు చెలరేగిపోతున్న నేపథ్యంలో ఈ సారి కూడా మహానాడును వర్చువల్‌గానే నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, గతేడాదిలానే రెండు రోజులపాటు నిర్వహించాలా? లేదంటే, 28న ఒక్క రోజుతోనే సరిపెట్టాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకునేందుకు రేపు చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
2019 ఎన్నికల అనంతరం రాజకీయంగా బలహీనపడిన టీడీపీ రానున్న కాలంలో పార్టీ పటిష్టతపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా విధానాలపై ధ్వజమెత్తనున్నారు. పాలనలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ రానున్న కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించే ఆవకాశం ఉంది.

Related posts

మాట తప్పనన్న ముఖ్యమంత్రి …మమ్ముల్ని వెంటాడతావా ? సీఎం పై బండి సంజయ్ నిప్పులు…

Drukpadam

జమిలి ఎన్నికలు చట్ట సవరణ లేకుండా సాధ్యమా ?

Drukpadam

20 రేట్ల ప్రతీకారం తీర్చుకుంటా …చంద్రబాబు

Drukpadam

Leave a Comment