తెలుగు రాష్ట్రాలు

పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు మోహన్ బాబు భార్య లేఖ…

  • ఇంట్లో విష్ణు గొడవ చేయలేదన్న నిర్మల
  • ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో.. విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని వ్యాఖ్య
  • మనోజ్ ఫిర్యాదులో నిజం లేదన్న నిర్మల

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు భార్య నిర్మల తొలిసారి స్పందించారు. ఇంట్లో విష్ణు గొడవ చేసినట్టు జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు ఆమె లేఖ రాశారు. 

డిసెంబర్ 14న నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్ పల్లిలోని మా ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఆరోజు విష్ణు గొడవ చేశాడంటూ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్టు తనకు తెలిసిందని చెప్పారు. ఆరోజు విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని తెలిపారు. బర్త్ డే సెలబ్రేషన్ తప్ప గొడవ జరగలేదని పేర్కొన్నారు. ఇంటికి వచ్చి తన గదిలో ఉన్న వస్తువులను తీసుకుని, కాసేపు తనతో మాట్లాడి వెళ్లాడని చెప్పారు. తమ ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో… విష్ణుకు కూడా అంతే హక్కు ఉందని తెలిపారు. మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని చెప్పారు. తాము ఇక్కడ పనిచేయలేమని చెప్పి ఇంట్లో పని చేస్తున్న వాళ్లు మానేశారని… ఇందులో కూడా విష్ణు ప్రమేయం లేదని తెలిపారు.

Related posts

చంద్రబాబును చూడగానే బాధ కలిగింది… మాట్లాడలేకపోతున్నారు: కాసాని

Ram Narayana

 భట్టి అన్నా బాగున్నారా… మీరు డిప్యూటీ కావడం సంతోషంగా ఉంది: ప్రజాభవన్‌లో వైఎస్ షర్మిల

Ram Narayana

చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌లకు విజ్ఞప్తి చేస్తున్నా: రేవంత్ రెడ్డి కీలక సూచన

Ram Narayana