Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బండి సంజయ్ కి బీజేపీలో టాప్ పోస్ట్ …

బండి సంజయ్ కి బీజేపీలో టాప్ పోస్ట్ …
బండి సంజయ్ కు కీలక బాధ్యతలను అప్పగించిన బీజేపీ హైకమాండ్
జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కు బాధ్యతల అప్పగింత
జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగింపు
జాతీయ కార్యదర్శిగా సత్య కుమార్ కు మరోసారి అవకాశం

బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ నిన్నమొన్నటివరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వర్తించారు . బీజేపీ అంతర్గత రాజకీయాల్లో ఆయనను బీజేపీ అధిష్టానం పదవినుంచి తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది ..బండి సంజయ్ బీజేపీని రాష్ట్రంలో ఉరుకులు పరుగులు పెట్టించారు . అధిష్టానం వద్ద మంచి మార్క్ లే కొట్టేశారు . ఆయన సేవలు పోరాట పటిమను గురించిన అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించింది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అందుకు భిన్నంగా పార్టీలో కీలక పోస్ట్ లభించింది.

తెలంగాణ బీజేపీ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. ఆయనకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను అప్పగించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సత్య కుమార్ కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించిన తర్వాత ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కీలక నేతలు కొందరు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా చూశాం. తాజాగా సంజయ్ కు జాతీయ స్థాయిలో బాధ్యతలను అప్పగించడంపై వీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇస్తే బాగుండునని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణాలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పార్టీకి మంచి గుర్తింపు తెచ్చారని కొందరు బీజేపీ నాయకులే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు . ….

Related posts

నేటి నుంచి గ్రూప్-1 పరీక్షలు… నిబంధనలు గుర్తుంచుకోండి!

Ram Narayana

చిరంజీవి మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారా ?

Drukpadam

ప్రతి ఒక్కరికీ శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా: ఈటల

Drukpadam

Leave a Comment