Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం …బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి పువ్వాడ….

ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం …బిల్లు ప్రవేశ పెట్టిన మంత్రి పువ్వాడ….
కార్మికులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామన్న మంత్రి
ఆస్తులన్నీ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయని అన్న పువ్వాడ
ప్రతిపక్షాల అనుమానాలకు వివరణ ఇచ్చిన

అనేక అనుమానాలు ఉత్కఠత మధ్య టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆదివారం అసెంబ్లీ ఆమోదించింది. బిల్లును రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సభలో ప్రవేశ పెట్టారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ అలానే ఉంటుందని ,దాని ఆస్తులు అలానే ఉంటాయని ,కేవలం ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వం లో విలీనం అవుతున్నారని స్పష్టం చేశారు . కొందరు ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుమానాలకు మంత్రి విసరణ ఇచ్చిన అనంతరం సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది…దీంతో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైయ్యే ప్రతిపాదనలకు లైన్ క్లియర్ అయింది .అంతకు ముందు రాష్ట్ర గవర్నర్ తమిళశై ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడారు …బిల్లుపై కొన్ని సూచనలు చేశారు . మొదటి రోజు గవర్నర్ హైద్రాబాద్ లో లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన చలో రాజ్ భవనంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొన్నది .. పుదుచ్చేరి లో ఉన్న గవర్నర్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆమె కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు … ఆదివారం ఉదయం ఆమె బిల్లుపై సంతకం చేశారు ..వెంటనే సభలో పెట్టి సభ ఆమోదం పొందారు ..

Related posts

తెలంగాణ కాంగ్రెస్ లో ఖమ్మం జోష్.. 

Drukpadam

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్..!

Ram Narayana

వీఆర్ఏలతో చర్చల కోసం కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం

Drukpadam

Leave a Comment