Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

షర్మిల కాంగ్రెస్ లో చేరతారా …?

షర్మిల కాంగ్రెస్ లో చేరతారా …?
చేరితే భాద్యతలు ఎక్కడ …ఏపీలోనా …? తెలంగాణలోనా …??
గత కొన్ని రోజులుగా షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం ..ఖండించని షర్మిల …
పైగా రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన షర్మిల
పాలేరు సీటు ఇవ్వడం కూడా కష్టమే ….
పార్టీని నడపడంపై పునరాలోచలో పడ్డ షర్మిల

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పార్టీ నడపడం సాధ్యకాదని తేలిపోయింది …దీంతో ఆమె తెల్ల జెండా ఎత్తనున్నారని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. …ఆమె జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకపోవడంతో కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారు అయినట్లే …అయితే ఇక్కడ ఒక ట్వీస్ట్ ఉంది…ఆమె కాంగ్రెస్ లో చేరితే ఏపీలో పనిచేయాలా …? లేక తెలంగాణలోనా …?? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఆమె తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు . కానీ ఆమెను ఏపీలో పనిచేయాలని అక్కడ పీసీసీ అధ్యక్ష భాద్యతలు సైతం అప్పగిస్తామని ఏఐసీసీ చెప్తున్నట్లు ప్రచారం జరుగుతుంది…
ఏపీలో పనిచేయడం ఆమెకు ఇష్టం లేదని పైగా తన అన్న పై నిత్యం తగాదా అసలు మంచిది కాదని తనతల్లితో పాటు హితులు ,బంధువులు , సన్నిహితులు చెపుతున్నారు ..ఆమె కూడా తెలంగాణాలో పాలేరు టికెట్ ఆశిస్తున్నారు . అందుకే ఆమె కాంగ్రెస్ లో చేరే విషయం ఏఐసీసీ చూసుకుంటుందని తెలంగాణ పార్టీ ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే చెప్పడం గమనార్హం…

దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ ఆమెకు పేరుంది. అచ్చం తండ్రి లాగానే అవభాలు ఉన్నాయని ప్రజలు భావిస్తారు …అన్నకు ఆమెకు ఆస్తి తగాదా ఉందని అందువల్లనే అన్న చెప్పినా, వినకుండా తెలంగాణాలో పార్టీ పెట్టారని ఆమెపై అభియోగాలు ఉన్నాయి… అన్నతో తగాదా ఉంటె ఏపీలో పార్టీ పెట్టాలిగాని ఇక్కడ ఎందుకు పెట్టారనే విమర్శలు ఉన్నాయి..ఆమె మాత్రం వాటిని పట్టించుకోకుండా తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని మూడు సంవత్సరాల క్రితం హాట్టహాసంగా పార్టీ పెట్టారు ..దానిపేరులో తెలంగాణ సెంటిమెంట్ ఉండేలా వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు ..రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు . పార్టీ పేరు, జెండా, ఎజెండా ఖరారు కాకముందే ఖమ్మంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు …తర్వాత కొద్దీ రోజులకు ఆమె రాష్ట్రంలో సభలు, సమావేశాలు పర్యటనలు చేపట్టారు ..సుమారు 3 వేల 700 కి .మీ నడిచిన మహిళాగా రికార్డు సృష్టించారు . ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లలోకూడా ఎక్కింది. నిరుద్యోగ సమస్యపై ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకోని ప్రతిమంగళవారం దీక్షల పేరుతో జిల్లాలు పర్యటించారు …అనేక కష్టాలు పడ్డారు .అవమానాలు ఎదుర్కొన్నారు . అరెస్టులు , కేసులు , గృహనిర్బంధాలూ అనేకం చవి చూశారు … అయిన చెలించకుండా ఆమె నిత్యం ప్రజల్లో ఉన్నారు …

పాలేరు లో పోటీపై ఆసక్తి …

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ప్రకటించారు .అందుకు అనుగుణంగా ఖమ్మం సమీపంలోని కరుణగిరి వద్ద స్థలం కొనుగోలు చేసి భారీస్థాయిలో పార్టీ కార్యాలన్నీ నిర్మిసున్నారు . శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో తల్లి కూతుర్లు ఇద్దరు ప్రసంగించారు .ఆ సందర్భంగా తన కూతురు షర్మిలను పాలేరు ప్రజలకు అప్పగిస్తున్నాని ఆమె ఇక్కడే ఉండి సేవలు చేస్తారని అన్నారు . ఈ మధ్యలో ఇక్కడకు సమీపంలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశారు .

ప్రజల నుంచి లభించని మద్దతు …ఆమె పార్టీలో చేరేందుకు నాయకుల విముఖత …

ఆమె తన తండ్రి వైయస్సార్ కు ఉన్న మంచి పేరు తనకు కలిసి వస్తుందని అనుకున్నారు . పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీ అవుతారని అనుకున్నారు . పెద్ద పెద్ద నేతలు తనకు అండగా ఉంటారని తన పార్టీలో చేరతారని భావించారు … కానీ అంతగా ప్రజల మద్దతు ఆమెకు లభించలేదు …పైగా అన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టవద్దని తన దూతలను పంపినప్పటికీ ఆయన మాట వినలేదు … ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు …చివరికి తన తల్లి వైయస్ విజయమ్మ సైతం ఏపీ సీఎం జగన్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండి కొంతకాలం వరకు షర్మిలకు మద్దతు ఇచ్చారు …తర్వాత ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న విమర్శలతో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పూర్తిగా కూతురు షర్మిలతోనే ఉండి ఆమెకు అండగా నిలిచారు. అనేక మంది నాయకులు తన పార్టీలో చేరతారని షర్మిల ఆశించారు . జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కోమటి రెడ్డి బ్రదర్స్ లాంటి వారిపై హోప్స్ పెట్టుకున్నారు . కానీ ఎవరు ముందుకు రాలేదు …బీఆర్ సైతం ఆమెను ఆంధ్రా బిడ్డగా ప్రోజక్ట్ చేసే ప్రయత్నం చేసింది…అందులో కొంతవరకు సక్సెస్ అయింది. ఆమె పార్టీలోకి వస్తారని అనుకున్న పెద్ద నేతలు రాకపోవడంతో ఆమె పునరాలోచనలో పడ్డారు . రాజన్న రాజ్యం సంగతి సరే పార్టీ మనుగడకే ప్రమాదం రావడంతో తాను సొంతంగా పార్టీ నడపడం సాధ్యకాదని ఆలస్యంగా తెలుసుకున్నారు. దీంతో ఆమె ఏ పార్టీలో చేరాలనేదానిపై చాలాకాలంగా ఆలోచనలు చేశారు ..చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపారు …కాంగ్రెస్ నేతలతో గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు .. ఆమెకు కాంగ్రెస్ లో చేరితే పాలేరు సీటు ఇస్తారనే గ్యారంటీ లేదు …ఎన్నికల తర్వాత మంచి పొజిషన్ ఇస్తామని అధిష్టానం చెపుతున్నట్లు తెలుస్తుంది… అందువల్ల ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు … ఇంతకీ షర్మిల కాంగ్రెస్ లో చేరతారా ..?లేదా అనేది ప్రశ్నర్ధకంగా మారింది…?

Related posts

సాగర్ డ్యాంపై తెలుగు రాష్ట్రాల ఢీ ..కేంద్రం హోమ్ శాఖ జోక్యం సద్దు మణిగిన వివాదం

Ram Narayana

ఏపీ నుంచి రిలీవ్… తెలంగాణ సీఎస్‌కు ఆ ముగ్గురు అధికారులు రిపోర్ట్!

Ram Narayana

జగన్‌కు షాక్… రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా… ఆమోదించిన చైర్మన్

Ram Narayana

Leave a Comment