అంతర్జాతీయం

ప్రపంచంలోనే తొలిసారి… మహిళ మెదడులో బతికున్న 8 సెం.మీ. పైథాన్

  • 64 ఏళ్ల మహిళ మెదడు నుండి కార్పెట్ పైథాన్‌ను గుర్తించిన వైద్యులు
  • మెదడులో ఈ పరాన్నజీవి ఉంటుందని ఊహించలేదన్న వైద్యులు
  • ఆకుకూరల ద్వారా వెళ్లి ఉంటుందంటున్న వైద్యులు, శాస్త్రవేత్తలు

64 ఏళ్ల ఓ మహిళ మెదడులో 8 సెంటిమీటర్ల పరాన్నజీవిని గుర్తించి బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత కూడా అది బతికే ఉంది. ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా ఆసుపత్రిలో జరిగింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన మహిళ మొదట పొత్తి కడుపులో నొప్పి, ఆ తర్వాత డయేరియోతో బాధపడుతూ జనవరి 2021లో స్థానిక ఆసుపత్రిలో చేరింది. 2022 నాటికి ఆమెలో క్రమంగా మతిమరుపు రావడం, ఒత్తిడి వంటివి కనిపించాయి. ఆ తర్వాత కాన్‌బెర్రా ఆసుపత్రికి తరలించారు. ఆమె మెదడును స్కాన్ చేసిన వైద్యులు అసాధారణ స్థితిని గుర్తించారు.

వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. అయితే ఆమె మెదడు నుండి ఓ 8 సెంటీమీటర్ల పరాన్నజీవి లేదా కార్పెట్ పైథాన్ ఉంటుందని వారు ఊహించలేదు. సర్జరీకి ముందు మెదడులో ఈ పరాన్నజీవి ఉంటుందని తాము భావించలేదని డాక్టర్ హరిప్రియా బండి, డాక్టర్ సంజయ సేననాయకే తెలిపారు. కార్పెట్ పైథాన్ ఉంటుందని, అది కూడా బతికే ఉంటుందని తమలో ఎవరూ అనుకోలేదని చెప్పారు. ఆ తర్వాత దానిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తీసుకు వెళ్లారు. 

తమకు తెలిసినంత వరకు మానవ లేదా ఇతర రకాల క్షీరజాతుల మెదడులో ఉన్న మొదటి పరాన్నజీవిగా తాము గుర్తించినట్లు సేననాయకే తెలిపారు. తమ వైద్య వృత్తిలో మొదటిసారి చూశామన్నారు. మెదడులో ఈ పరాన్నజీవి కలిగిన 64 ఏళ్ల మహిళ న్యూసౌత్ వేల్స్ లోని కార్పెట్ పైథాన్‌లు నివసించే సరస్సు ప్రాంతానికి సమీపంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. ఆమెకు సరీసృపాలతో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఆమె తిన్న ఆకుకూరలు లేదా ఇతర కూరగాయల ద్వారా వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఏదైనా కార్పెట్ పైథాన్ తన మలాన్ని ఆకుకూరల్లోకి వ్యాప్తి చెందించి ఉండవచ్చునని, అలా వెళ్లి ఉండే అవకాశముందని డాక్టర్లు, సైంటిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.

Related posts

శ్వేతా సౌధంపై మరోసారి ట్రంప్…అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం …

Ram Narayana

ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయుడు.. ప‌ట్టించిన వారికి రూ. 2 కోట్ల రివార్డు!

Ram Narayana

కాల్పుల్లో గాయపడ్డ స్లోవేకియా ప్రధానికి విజయవంతంగా సర్జరీ..!

Ram Narayana