Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

దోమలు విపరీతంగా ఉన్నాయి.. స్నానానికి చన్నీళ్లు ఇస్తున్నారు: నారా భువనేశ్వరి

  • రాజమండ్రి జైల్లో తన భర్తకు అరకొర సౌకర్యాలు కల్పిస్తున్నారన్న భువనేశ్వరి
  • దోమకాట్లతో గడపాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన
  • కేటగిరి1 కింద ప్రత్యేక సదుపాయాలు కనిపించడం లేదని వ్యాఖ్య

రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన భర్త చంద్రబాబుకు అరకొర సౌకర్యాలను కల్పిస్తున్నారని ఆయన భార్య నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉన్న బ్లాక్ లో దోమలు విపరీతంగా ఉన్నాయని చెప్పారు. దోమకాట్లతోనే ఆయన గడపాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. స్నానం చేయడానికి వేడి నీళ్లు కాకుండా, చన్నీళ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తికి జైల్లో కేటగిరి1 కింద ప్రత్యేక సదుపాయాలను కల్పించాల్సి ఉందని, కానీ అక్కడ అవేమీ కనిపించలేదని చెప్పారు. మరోవైపు భద్రతపై అనుమానాల నేపథ్యంలో… ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి చంద్రబాబు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 

Related posts

ప్ర‌ధాని మోదీకి విన‌తి ప‌త్రంతో వీడ్కోలు ప‌లికిన ఏపీ సీఎం జ‌గ‌న్‌

Drukpadam

పంచదారను పూర్తిగా వదిలిపెట్టాలా?

Drukpadam

చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

Ram Narayana

Leave a Comment