Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు!

  • మైనంపల్లి రాజీనామాతో  సీఎం కేసీఆర్ నిర్ణయం
  • గతంలో ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిన మర్రి రాజశేఖర్‌రెడ్డి
  • జనగామ నుంచి పల్లా, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి ఖరారు!
  • గోషామహల్ రేసులో నందకిశోర్, ఆశిష్ కుమార్

మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రస్తుతం మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి పేర్లు కూడా ఖరారైనట్టు చెబుతున్నారు. నందకిశోర్, ఆశిష్‌కుమార్‌లలో ఒకరు గోషామహల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.

Related posts

కేసీఆర్‌కు మళ్లీ అవకాశమిస్తే ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కే పరిమితం: ఈటల రాజేందర్

Ram Narayana

జయలలిత దాచిపెట్టిన ఆస్తులని మంత్రి మల్లారెడ్డి దొంగిలించాడు: కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ

Ram Narayana

బీఆర్ యస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ కానున్నారా …?

Ram Narayana

Leave a Comment