Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

నేపాల్‌లో భూకంపం.. ఢిల్లీ, లక్నో తదితర ప్రాంతాల్లో కంపించిన భూమి

  • రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతతో నేపాల్‌లో భూకంపం
  • భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ
  • మధ్యాహ్నం గం.2.51 సమయానికి కంపించిన భూమి

నేపాల్‌లో మంగళవారం రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రాన్ని నేపాల్‌లో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది.

‘3-10-2023 మధ్యాహ్నం 2.51 గంటలకు నేపాల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది’ అని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో, హపూర్, అమ్రోహా ప్రాంతాల్లోను ప్రకంపనలు వచ్చాయని తెలిపింది.

Related posts

అమెరికాలో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి…

Ram Narayana

భారత పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగాన్ని ఉల్లంఘించొచ్చు.. అమెరికా కాంగ్రెస్ పరిశోధన విభాగం…

Ram Narayana

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ. పొడవైన హైవే!

Ram Narayana

Leave a Comment