Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంలో యశోద వైద్యసేవలు విస్తరించాలి …బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ…

ఖమ్మంలో యశోద వైద్యసేవలు విస్తరించాలి …బీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామ…
జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు ప్రసంశనీయం
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో రెండు ప్రభుత్వం వైద్యకళాశాలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దే
ఖమ్మం మెడికల్ హబ్ గా ఎదుగుతుంది
ప్రజలవద్దకు వైద్య సేవలు …ఇటీవలనే రాష్ట్ర వ్యాపితంగా కంటి పరీక్షలు

ఖమ్మంలో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పటల్స్ సేవలు అందించడం ప్రశంశనీయమని ఖమ్మం ఎంపీ లోకసభలో బీఆర్ యస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు . శనివారం ఖమ్మంలోని యశోద హాస్పటల్స్ సౌజన్యంతో ,ఖమ్మం ప్రెస్ క్లబ్ , టీయూడబ్ల్యూ జె (ఐజేయూ ) నగర కమిటీ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఉచిత మెడికల్ క్యాంపు కార్యక్రమానికి నామ ముఖ్యఅతిధిగా హాజరై క్యాంపును రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు .ఈసందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం పాపారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నామ మాట్లాడుతూ ఖమ్మం నగరం అనేక రంగాలలో విస్తరిస్తుంచిందని వైద్య రంగంలో హైద్రాబాద్ కు పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే అనేక మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండటం మంచి పరిణామమని అన్నారు . ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న సూర్యాపేట , మహబూబాబాద్ , పక్కన ఉన్న ఏపీ నుంచి కూడా అనేక మంది పేషంట్లు ఖమ్మం నగరానికి వైద్యసేవలు కోసం వస్తున్నారని అన్నారు . రాష్ట్ర ముఖమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో వైద్యరంగం ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు 32 జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం ఒక గొప్ప మార్పు అన్నారు . ఇది వైద్యరంగంలో దేశంలోనే కొత్త వరవడిని నెలకొల్పింది అన్నారు . వైద్య విద్య కేవలం డబ్బులు ఉన్నవారికోసమే ఉండేదని నేడు అది పోయిందని పేద విద్యార్థులు సైతం తమ తెలివి తేటలతో మెడికల్ సీట్లు పొందుతున్న విషయాన్నీ గుర్తు చేశారు …

ఈ కార్యక్రమంలోపాల్గొన్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె .రాంనారాయణ మాట్లాడుతూ యశోద హాస్పటల్స్ ప్రతిష్టాత్మకమైనవని , వారు ఎంతో గొప్పమనసుతో ఇక్కడ అవుట్ పేషంట్ సేవలు ప్రారంభించడం హర్షణీయమని అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు . ప్రత్యేకించి జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత టెస్టులు చేయడం అభినందనీయమని అన్నారు . ఉచిత టెస్టులతో పాటు జర్నలిస్టులకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు యశోద వారు రాయితీతో వైద్య సేవలు అందించాలని కోరారు . ఇందుకు కృషి చేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మైసా పాపారావు ,యశోద గ్రూప్ హాస్పటల్స్ జనరల్ మేనేజరు శ్రీనివాస్ రావు,ఖమ్మం మేనేజర్ నాగార్జున పలువురు డాక్టర్లు ఇతర సిబ్బందికి కృతజ్ణతలు తెలిపారు . జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ తాను నిరంతరం జర్నలిస్టులు అందుబాటులో ఉంటానని యశోద గ్రూప్ హాస్పటల్స్ లో వైద్యసేవలకు తనను సంప్రదిస్తే తగిన విధంగా సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు . అదే విధంగా తమ ఆంబులెన్స్ సూర్యాపేట -హైద్రాబాద్ హైవేలో ఎమర్జన్సీ కేసులు లిఫ్ట్ చేసేందుకు కట్టంగూర్ వద్ద నిరంతరం ఉచితంగా అందుబాటులో ఉంటుందని అన్నారు . సుమారు 20 మంది డాక్టర్లు ఖమ్మం సెంటర్లో అందుబాటులో ఉండి టెస్టులు చేసి వైద్య సేవలు అందిస్తారని అన్నారు . ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల ఉన్న భద్రాద్రి కొత్తగూడెం , సూర్యాపేట , మహబూబాబాద్ జిల్లాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర రాష్ట్ర నాయకులూ నేర్వనేని వెంకట్రావు , టీయూడబ్ల్యూ జె , (ఐజేయూ ) జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు , ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ రావు , ఉపాధ్యక్షులు మామిడాల భూపాల్ , జిల్లా నాయకులు నలజాల వెంకట్రావు , నామ పోరుషోత్తం , మొహినుద్దీన్ , తాళ్లూరి మురళి , జనార్దనా చారి ,దిశా సాగర్ , నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ రావు , నాయకులు అయ్యప్ప , కెవి ,మేడి రమేష్ ,డెస్క్ జర్నలిస్టులు నారాయణ రావు , కె ప్రసాద్ , బశ్వేశ్వరరావు ,తదితరులు పాల్గొన్నారు .బీఆర్ యస్ నాయకులు నల్లమల వెంకటేశ్వర్రావు , తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా నామకు వైద్యలు పరిక్షలు చేశారు ….

Related posts

మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన సింగ‌పూర్ హైక‌మిష‌న‌ర్…

Drukpadam

ఖమ్మం కు యూనివర్సిటీ ఇవ్వండి …సీఎం కు సీఎల్పీ నేత భట్టి విజ్ఞప్తి!

Drukpadam

ప్రధాని ప్రశంసలపై స్పందించిన తెలుగు విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ కూరెళ్ల!

Drukpadam

Leave a Comment