Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

భారత్-కెనడా ఉద్రిక్తతలపై జస్టిన్ ట్రూడోతో ఫోన్‌లో మాట్లాడిన రిషిసునక్

  • ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్తత
  • భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల తాజా పరిస్థితుల్ని రిషి సునక్‌కు వివరించిన ట్రూడో   
  • పరిస్థితులు మెరుగుపడతాయని కెనడా ప్రధానితో చెప్పిన రిషి సునక్

ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పరిస్థితులు మెరుగుపడతాయని కెనడా ప్రధానితో వ్యాఖ్యానించినట్లుగా బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల తాజా పరిస్థితుల్ని రిషి సునక్‌కు ట్రూడో వివరించారని, ఈ క్రమంలో దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్ సూత్రాలు సహా సార్వభౌమాధికారం, చట్టపాలనను అన్ని దేశాలు గౌరవించాలనే వైఖరికి బ్రిటన్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారని, తదుపరి చర్యలపై సంప్రదింపులు కొనసాగించేందుకు రెండు దేశాల నేతలు అంగీకరించినట్లు తెలిపింది.

Related posts

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రపంచ ప్రముఖులు

Ram Narayana

మయన్మార్ భూకంప తీవ్రత 334 అణుబాంబుల విస్పోటనంతో సమానమట!

Ram Narayana

మయన్మార్‌, బ్యాంకాక్‌ల‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిన భ‌వ‌నాలు..

Ram Narayana

Leave a Comment