Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ …!

7 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ …అధికారికంగా ప్రకటించడమే తరువాయి…
ఖమ్మంనికి తుమ్మల …పాలేరుకు పొంగులేటి
మధిర భట్టి …ఇల్లందు కోరం కనకయ్య
వైరా …..రామదాస్ నాయక్
కొత్తగూడెం ….కూనంనేని సాంబశివరావు ( సిపిఐ) పొత్తులో భాగంగా/ ఎడవల్లి కృష్ణ (ఫైనల్ కావాల్సి ఉంది )
సత్తుపల్లి …. డాక్టర్ మట్టా రాగమయి
అశ్వారావుపేట …..జారే ఆదినారాణయం / తాటి వెంకటేశ్వర్లు (ఫైనల్ కావాల్సి ఉంది )
పినపాక ….పాయం వెంకటేశ్వర్లు /పొదెం వీరయ్య (ఫైనల్ కాలేదు )
భద్రాచలం ….పొదెం వీరయ్య (పొత్తులో భాగంగా సిపిఎం )

నవంబర్ 30 జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన సిపిఐ , సిపిఎం తరుపున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితా సిద్దమైనట్లు అత్యంత విశ్వసనీయసమాచారం …కాంగ్రెస్ పార్టీ నుంచి హేమాహేమీలు రంగంలో దిగబోతున్నారు మాజీమంత్రి తుమ్మల ఖమ్మం నుంచి , మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు దీంతో జిల్లాలో ఈ రెండు హాట్ సీట్లుగా మారబోతున్నాయి. ఖమ్మం నుంచి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ పై తుమ్మల పోటీచేయబోతుండడటంతో పోటీ రసత్తరంగా మారె అవకాశం ఉంది…నిన్నమొన్నటివరకు ఖమ్మంలో పోటీ ఎవరు ఉంటారనే దానికి తెరదించుతూ తుమ్మల ను అధిష్టానం ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది…పాలేరు నుంచి మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీచేయడం ఖాయమైంది సమాచారం….

ఇక ఉమ్మడి జిల్లాలోని మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , వైరా నుంచి రెండు మూడు పేర్లు పరిశీలనలోకి వచ్చిన చివరికి రాందాస్ నాయక్ పేరు ఫైనల్ అయినట్లు చెబుతున్నారు .అయితే పొంగులేటి విజయాబాయి కోసం పట్టుబట్టినప్పటికీ సర్వేలో రామదాస్ కు అనుకూలంగా రావడంతో ఆయనవైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తుంది …సత్తుపల్లి సీటుకు డాక్టర్ మట్టా రాగమయి , కె సుధాకర్ పోటీపడగా మట్టా ఫ్యామిలీ కె అక్కడ సర్వే అనుకూలంగా ఉందని అంటున్నారు . ఇల్లందు కోరం కనకయ్య ఫైనల్ అయిందని తెలుస్తుంది….కొత్తగూడెం పొత్తులో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కు అవకాశం ఉందని సమాచారం ….పినపాక విషయంలో కొత్త చర్చ జరుగుతుంది..భద్రాచలం పొత్తులో భాగంగా సిపిఎం కు కేటాయిస్తే పొదెం వీరయ్య ను పినపాక నుంచి పోటీచేయిస్తారని అంటున్నారు . అశ్వారావుపేట అభ్యర్థి విషయంలో జారే ఆదినారాయణ , తాటి వెంకటేశ్వర్లు మధ్య సర్వే జరుపుతున్నారు ఎవరికీ అనుకూలంగా ఉంటె వారికీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది…

జిల్లాకు చెందిన సెల్పీనేత భట్టి విక్రమార్క , మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఢిల్లీలో మకాం వేశారు . ఈరోజు సాయంత్రానికి వారు ఢిల్లీ నుంచి తిరిగి రానున్నారు ..సిపిఐ , సిపిఎం మధ్య పొత్తు విషయం లో చర్చలు జరుపుతున్నారు అవి కూడా ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైందని అంటున్నారు . ఇప్పటికే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా లు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే , కేసి వేణుగోపాల్ తో చర్చించినట్లు సమాచారం ….

Related posts

దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ దీక్ష చేయండి …కేటీఆర్ ,హరీష్ కు రేవంత్ రెడ్డి సవాల్ …

Ram Narayana

సీఎం కేసీఅర్ పై తుమ్మల సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

మూడేళ్లకు మించి కౌలుకు ఇస్తే ఆ భూమి మీద హక్కులు పోతాయి: కేసీఆర్

Ram Narayana

Leave a Comment