Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం..

ఏపీ మంత్రికి తప్పిన ప్రమాదం..
ఖమ్మంజిల్లా సత్తుపల్లి దగ్గర ఘటన
సత్తుపల్లి మీదగా హైద్రాబాద్ వెళుతున్న మంత్రి అంబటి రాంబాబు
ఎదురుగా వస్తున్న గోధుమ బస్తాల లోడు తాడు లూజు అయి మంత్రి కారు మీద పడిన వైనం
దెబ్బతిన్న మంత్రికారు .. మరో కారులో మంత్రి హైద్రాబాద్ కు ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబుకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంత్రి అంబటి గురువారం రాత్రి 8.00 సమయంలో సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళుతున్నారు. అదే సమయంలో గోధుమ బస్తాల లోడుతో వైజాగ్ వెళుతున్న ఓ లారీ సత్తుపల్లి దాటి హిందూ స్మశాన వాటిక ప్రదేశానికి చేరగానే తాడు లూజ్ అయి లారీలో ఉన్న గోధుమ బస్తాలు కిందకు జారాయి. అదే సమయంలో మంత్రి హైదరాబాద్ వెళుతుండగా కొన్ని బస్తాలు మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై పడ్డాయి. సంఘటన గ్రహించిన సెక్యూరిటీ వెంటనే వాహనాలు ఆపి తగిన చర్యలు తీసుకోవడంతో మంత్రికి ప్రమాదం తప్పింది. మరో వాహనంలో మంత్రి వెళ్లారు. ఈ సంఘటనకు కారణమైన లారీని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

చెన్నై మెరీనా బీచ్ లో తొక్కిసలాట…ఐదుగురు మృతి!

Ram Narayana

ఢిల్లీలో భారీ పేలుడు క‌ల‌క‌లం…

Ram Narayana

హైదరాబాద్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఐటీ ఉద్యోగులైన దంపతుల దుర్మరణం!

Ram Narayana

Leave a Comment