Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

సాగర్ డ్యాంపై తెలుగు రాష్ట్రాల ఢీ ..కేంద్రం హోమ్ శాఖ జోక్యం సద్దు మణిగిన వివాదం

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్రం స్పందించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ వర్గాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. సాగర్ డ్యామ్ వివాదంపై ఈ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో వివాదం సద్దు మణిగింది ….

ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి… ఏపీ, తెలంగాణ సీఎస్ లు, డీజీపీలు… సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అధికారులు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు.

సాగర్ డ్యాంపై యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొన్నారు. నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితే కొనసాగుతుందని అన్నారు. డ్యామ్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని భల్లా వెల్లడించారు.

కేంద్రం ప్రతిపాదనలకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి.

Union home ministry video conference on Nagarjuna Sagar issue

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్రం స్పందించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ వర్గాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. సాగర్ డ్యామ్ వివాదంపై ఈ సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సమావేశానికి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి… ఏపీ, తెలంగాణ సీఎస్ లు, డీజీపీలు… సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ అధికారులు హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఉభయ తెలుగు రాష్ట్రాలకు పలు సూచనలు  చేశారు.

సాగర్ డ్యాంపై యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొన్నారు. నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితే కొనసాగుతుందని అన్నారు. డ్యామ్ ప్రస్తుతం సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని భల్లా వెల్లడించారు. కేంద్రం ప్రతిపాదనలకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి.

ఉదయం నాగార్జున డ్యామ్ పై రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు మోహరించడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది ……

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నిన్న మొదలైన హైటెన్షన్ నేడు కూడా కొనసాగుతోంది. డ్యామ్‌కు అటువైపు ఏపీ, ఇటువైపు తెలంగాణ పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. డ్యామ్‌లోని 13వ గేటు నుంచి తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ ఏపీ పోలీసులు నిన్న వేసిన ముళ్లకంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఉదయం కూడా ఆ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు.

మరోవైపు, ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. నిన్న ఎన్నికల విధుల్లో ఉన్న తెలంగాణ పోలీసులు ఈ ఉదయం డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు. సాగర్ వద్ద ఉద్రిక్తతపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును ఖండించారు. ఇది పూర్తిగా శాంతిభద్రతల సమస్య కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసి మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతానని పేర్కొన్నారు.

ఇది చాలా సున్నితమైన అంశం… గొడవలు అనవసరం: మంత్రి అంబటి వ్యాఖ్యలు

  • నిన్న నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతలు
  • గేట్ల స్వాధీనం అంశంపై తెలుగు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు
  • సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్న అంబటి
  • తమ భూభాగంలోకే ఏపీ పోలీసులు వెళ్లారని స్పష్టీకరణ
AP Minister Ambati Rambabu press meet on Nagarjuna Sagar project issue

నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా అనూహ్యరీతిలో నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాగర్ పై ఏపీ పోలీసులు దండయాత్ర అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తమ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్లారని, అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అంబటి విమర్శించారు. 

తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన అవసరం కానీ, మరో పార్టీని ఓడించాల్సిన అవసరం కానీ తమకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలపై తమకేమీ ఆసక్తి లేదని, అక్కడ ఎవరు గెలిచి అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. కొందరు రెచ్చగొట్టి గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, గొడవలు అనవసరం అని హితవు పలికారు. 

సాగర్ కు సంబంధించి తమ వాటాకు మించి ఒక్క నీటి చుక్క కూడా వాడుకోలేదని అన్నారు. ఈ విషయంలో గతంలో చంద్రబాబు సర్కారు విఫలమైతే, ఇప్పుడు జగన్ సర్కారు సక్సెస్ అయిందని మంత్రి అంబటి గర్వంగా చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. అసలీ వివాదం చంద్రబాబు హయాం నుంచే ఉందని, సాగర్ కుడి కాలువను కూడా తెలంగాణ ప్రభుత్వమే నిర్వహిస్తుండడం చట్టవిరుద్ధమని తెలిపారు. మా నీళ్లు మా రైతులకు విడుదల చేయాలంటే మేం తెలంగాణ అనుమతి తీసుకోవాలా? అని అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తన వాటాను తాను వాడుకునే స్వేచ్ఛ ఏపీకి కావాలని, పురందేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జునసాగర్ డ్యామ్ అంశంలో ఏపీ ప్రభుత్వ చర్యలను ఎవరూ తప్పు పట్టలేరని, ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని విమర్శించారు. ఈ అంశాన్ని రాజకీయాలకు ముడివేసి, తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం తగదని అన్నారు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 13వ నెంబరు గేటు వరకు భౌగోళికంగా ఏపీకి చెందుతుందని, అంతవరకే తాము స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కృష్ణా బోర్డు నిర్ణయాల ప్రకారం తెలంగాణ వ్యవహరించడంలేదని, అందుకే ఏపీ హక్కులను కాపాడుకోవడానికే ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. 

“రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నాగార్జునసాగర్ డ్యామ్ లోని 26 గేట్లలో 13 గేట్లు ఏపీకి, మరో 13 గేట్లు తెలంగాణకు చెందుతాయి. కానీ సాగర్ ప్రాజెక్టు మొత్తాన్ని తెలంగాణ స్వాధీనం చేసుకుని నిర్వహిస్తుండడంతో ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ఇప్పుడు సాగర్ డ్యామ్ లో ఏపీకి చెందిన భూభాగాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదు” అని మంత్రి అంబటి వివరించారు.

Related posts

తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్ల వరద సాయాన్ని ప్రకటించిన కేంద్రం!

Ram Narayana

హైదరాబాద్‌ ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు.. వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సన్నాహాలు!

Ram Narayana

అక్షర సూరీడి అఖరిప్రయాణం…

Ram Narayana

Leave a Comment