మన దగ్గర సహాయం పొందిన వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు …మాజీఎమ్మెల్యే కందాల
నేను మీతోనే ఉంటాను..మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా
గెలుపు ఓటములు సహజం.. వాటి గురించి భాదపడంలేదు ..
పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది మనం..
మార్పు …మార్పు అన్నారు …చూద్దాం
ప్రజల తీర్పును గౌరవించి వారికి మరింత అందుబాటులో ఉందాం..
ప్రజలకు మరింత చేరువకావాలి,కొత్త ప్రభుత్వంకు కొంత సమయం ఇద్దాం..
మనదగ్గర సహాయం పొందిన వాళ్ళుకూడా ఓట్లు వేయలేదు ….నేను కూడా ఊహించలేదు..ఇలా జరుగుతుందని ….గెలుపోటములు సహజం …మార్పు ,మార్పు అన్నారు …ఏమి మార్పో చూద్దాం …ఫలితాలు మనకు అనుకూలంగా లేవు … వేలాది మందికి సహాయం చేశాను …ప్రజలు ఏమి పోగుట్టుకున్నారో ఇప్పుడు అర్ధం కాదు …కొంతకాలం ఆగుదాం….నేను మీతోనే ఉంటాను …ఎవరు బాధపడాల్సిన పనిలేదు …ప్రజల తీర్పును గౌరవిద్దాం…అని పాలేరు మాజీఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో తన భాదను దిగమింగుతూ చెప్పిన మాటలివి …సమావేశంలో వివిధ మండలాల నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు …
ఖమ్మం సాయి గణేష్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు సమీక్ష సమావేశం నిర్వహించిన కందాళ కార్యకర్తలకు దైర్యం నింపే ప్రయత్నం చేశారు …మండలవారీగా ఓట్ల సమీక్షా చేశారు … ఇంత పెద్ద మొత్తంలో తేడా వస్తుందని అనుకోలేదని అన్నారు …మనకు ఎక్కడ చెడ్డ పేరు లేదు …అయినా ఫలితం మనుకు అనుకూలంగా లేదు …కారణాలు విశ్లేషించు కోవాల్సిందే… ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వ సాదారణమని వాటిని తాను పట్టించుకోవడంలేదు … మీరు కూడా పట్టించుకోవద్దని అన్నారు … ఐదేండ్లు గా ప్రజలకు అనేక సేవలు అందించాం ….ప్రజల తీర్పును శిరస వహించాల్సిందే….జీవితంలో గెలుపు ఓటమి సర్వ సాధారణం….కొత్త ప్రభుత్వం కు కొంత సమయం ఇద్దాం.గొడవలకు తగాదాలకు దూరంగా ఉండాలి….నేను మీతోనే ఉంటా …ఎవరు భాదపడవద్దు ….పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాధాలు.వేలాది మంది ఓటర్లు మనకు ఓట్ల ద్వార మద్దతు తెలపడం జరిగిందని,వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.అనంతరం బూత్ ల వారిగా తగ్గిన ఓట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఉపేందర్ రెడ్డి అభిమానులు ,బీఆర్ యస్ కార్యకర్తలు హాజరైయ్యారు …