Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు

  • ఖిలాఫత్ ఇండియా పేరిట బెదిరింపు ఈ-మెయిల్
  • దేశంలోనే అతి పెద్ద స్కాం జరిగిందంటూ వెల్లడి
  • నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్
  • ఆర్బీఐ, పలు అగ్రశ్రేణి బ్యాంకుల్లో బాంబులు పేలతాయని బెదిరింపు
Bomb threat for RBI and top banks

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు బాంబు బెదిరింపు వచ్చింది. దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ జరిగిందని…  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే… ముంబయిలో ఆర్బీఐ కార్యాలయంలోనూ, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ సహా 11 చోట్ల బాంబులు పేలతాయని ఆ ఈ-మెయిల్ లో పేర్కొన్నారు. 

దీనిపై ముంబయి పోలీసులు స్పందించారు. ఈ-మెయిల్ లో పేర్కొన్న అన్ని ప్రదేశాల్లో నిశితంగా తనిఖీలు చేశామని, ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 

కాగా, ‘ఖిలాఫత్ ఇండియా’ అనే పేరు మీద బెదరింపు ఈ-మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. నిర్మలా సీతారామన్, శక్తికాంత దాస్, మరికొందరు కేంద్ర మంత్రులు, బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా రాజీనామా చేయాలని ఆ ఈ-మెయిల్ లో పేర్కొన్నారు.

Related posts

వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టిన సైబర్ నేరగాళ్లు!

Drukpadam

ఎన్నికల వేళ ల‌క్నోలో నిషేదాజ్ఞలు …మే 17 వ‌ర‌కు 144 సెక్ష‌న్‌..

Ram Narayana

కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్.. ఒక్కరోజు ఖర్చెంతంటే!

Drukpadam

Leave a Comment