- దేశ ఆర్థిక వ్యవస్థపై విస్తృత అవగాహన ఉన్న వ్యక్తిగా అరవింద్ పనగడియాకు పేరు
- నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం
- పనగడియాను నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు
- త్వరలో ఆర్థిక సంఘం సభ్యుల పేర్లు ప్రకటన
నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా..16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆర్థిక సంఘం కార్యదర్శిగా రిత్విక్ రంజనమ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం రిత్విక్ రంజనమ్ కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక సంఘం సభ్యుల పేర్లు విడిగా ప్రకటించనున్నారు.
పనగడియా(71) నీతి అయోగ్ తొలి ఉపాధ్యక్షుడిగా 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకూ కొనసాగారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో ‘ఇండియన్ పొలిటికల్ ఎకానమీ’ ప్రొఫెసర్‌గా ఉన్నారు. అంతకుమును, ఆసియా అభివృద్ధి బ్యాంకు ముఖ్య ఆర్థిక సలహాదారుగా కూడా సేవలందించారు. 2012లో కేంద్రం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. భారత ఆర్థిక వ్యవస్థపై విస్తృత అవగాహన ఉన్న వ్యక్తిగా పనగడియా గుర్తింపు పొందారు.